ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వనున్న రామ్ చరణ్..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాసినిమాకు తన గ్రాఫ్ ను పెంచుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం రామ్ చరణ్ తనకు మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

 Is Charan Giving A Chane To The Flop Director Ramcharan, Vakantham Vamshi, Kick,-TeluguStop.com

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నటించబోయే సినిమాల గురించి స్పష్టత రావాల్సి ఉంది.

అయితే నా పేరు సూర్య నా ఇండియా సినిమాకు దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ రామ్ చరణ్ తో తదుపరి సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని రామ్ చరణ్ ఈ ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రచయిత, డైరెక్టర్ గా వక్కంతం వంశీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితమే.వక్కంతం వంశీ కథతో తెరకెక్కిన్ కిక్, రేసుగుర్రం, టెంపర్, ఎవడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో చాలా సినిమాలకు వక్కంతం వంశీనే కథ అందించారు.టెంపర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన తరువాత ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్టర్ గా సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఆ తరువాత అల్లు అర్జున్ ఛాన్స్ ఇవ్వడంతో వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తెరకెక్కించాడు.

కథ పరంగా ఆ సినిమా బాగానే ఉన్నా అల్లు అర్జున్ పాత్ర మరీ సీరియస్ గా ఉండటం, కథనంలోని కొన్ని లోపాలు సినిమాకు మైనస్ గా మారాయి.ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వక్కంతం వంశీకి వెంటనే మరో అవకాశం రాలేదు.

అయితే చరణ్ కు ఇప్పటికే కథ చెప్పిన వక్కంతం వంశీ చరణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడని తెలుస్తోంది.గతంలో ఆగడు లాంటి ఫ్లాప్ తరువాత శ్రీనువైట్లకు ఛాన్స్ ఇచ్చిన చరణ్ వక్కంతం వంశీకి కూడా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube