మొత్తానికి చంద్ర‌బాబు ప్లాన్ స‌క్సెస్ అయిందా.. ప‌బ్లిక్ మాటేమిటి..?

రాజ‌కీయాల్లో ఆవేశం క‌న్నా కూడా ఎమోష‌న్ చాలా ముఖ్యం.ఎందుకంటే జ‌నాలు ఆవేశానికి క‌నెక్ట్ కారు.

 Is Chandrababu's Plan A Total Success   What About The Public ..?, Chandrababu,-TeluguStop.com

ఎమోష‌న్‌కు మాత్ర‌మే క‌నెక్ట్ అవుతారు.ఈ విష‌యం రాజ‌కీయాల్లో 40ఏండ్లు ఉన్న చంద్ర‌బాబుకు బాగా తెలుసు.

అందుకే ఆయ‌న ఎన్న‌డూ కూడా ఆవేశానికి పోకుండా సంద‌ర్భాను సారంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు అందుకే ఆయ‌న ఇన్నేండ్ల పాటు రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నార‌ని చెప్పాలి.అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ ప్ర‌జ‌ల్లో పుంజుకోవ‌డం స్టార్ట్ అయింద‌ని చెప్పొచ్చు.

గ‌తానికి భిన్నంగా ఇప్పుడు ప్ర‌జ‌ల్లో టీడీపీ పేరు బాగానే వినిపిస్తోంది.

మొన్న‌టి వ‌ర‌కు అస‌లు ఆ పార్టీ బ‌ల‌ప‌డుతుందా అంటే ఏమో అనే స‌మాధానాలు వినిపించేవి.

కానీ ఇప్పుడు మాత్రం కొంత అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.మొన్న‌టి వ‌రకు వ‌రుస ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీ ఎప్పుడైతే చంద్ర‌బాబు అసెంబ్లీలో దారుణంగా అవ‌మాన ప‌డ్డారో ఆ త‌ర్వాత క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంతో ఇటు పార్టీలో, అటు ప్ర‌జ‌ల్లో అనూహ్యమైన స్పందన వ‌స్తోంద‌నే చెప్పాలి.

ఈ ఘ‌ట‌న టీడీపీ నాయ‌కుల‌ను ఒక్క తాటిమీద‌కు తీసుకువ‌చ్చింది.కార్య‌క‌ర్త‌లు ఎక్క‌డికక్క‌డ నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు పిలుపునిస్తున్నారు.

Telugu Ap Potics, Assembly, Chandrababu, Tdp, Ys Jagan, Ysrcp-Telugu Political N

గ్రౌండ్ లెవ‌ల్లో కార్య‌క‌ర్త‌లు సంఘ‌టితం కావ‌డంతో ఆ ప‌రిణామాలు జ‌నాల్లోకి బ‌లంగా చొచ్చుకెళ్తున్నాయి.ఎప్పుడైనా పెద్ద నాయ‌కులు చేసే ప‌నుల కంటే కూడా గ్రౌండ్ లెవ‌ల్లో కార్య‌క‌ర్త‌లు చేసే ప‌నులే ప్ర‌జ‌ల్లోకి వెళ్తాయి.ఇప్పుడు టీడీపీలో కూడా ఇదే జ‌రుగుతోంది.ఇక అటు సోష‌ల్ మీడియాలో కూడా వైసీపీ మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌చ్చే విధంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు బాగా వైర‌ల్ అవుతున్నాయి.ఇలా అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించి పార్టీకి సానుభూతి ప‌ర‌మైన ఆద‌ర‌ణ వ‌చ్చేలా చంద్ర‌బాబు ప్లాన్ స‌క్సెస్ అయింద‌నే చెబుతున్నారు విశ్లేష‌కులు.

మ‌రి ఇదే ప‌రిస్థితులును జ‌గ‌న్ కంటిన్యూ చేస్తారా లేదా అన్న‌ది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube