అన్నయ్య కోసం పవన్..బాబు ముందు భారీ ప్రపోజల్.?

పవన్ కళ్యాణ్ చిరంజీవి కోసం ఏదన్నా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు…చిరంజీవి రాజకీయంగా ఎదగాలని అనుకున్నా సరే ఇప్పటికి అది నెరవేరలేదు.అయితే పవన్ మాత్రం ఇప్పుడు ఓ విబ్భిన్నమైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు.

 Is Chandrababu Rejected Pawan Proposal..?-TeluguStop.com

అయితే చిరంజీవి రాజ్యసభ సభ్యతం ముగుస్తున్న సమయంలో మరో మారు రాజ్యసభకి చిరంజీవిని తీసుకుని వెళ్లాలని పవన్ భావిస్తున్నాడట.అందుకే.

ప‌వ‌న్ చంద్ర‌బాబు ముందు ఓ కొత్త ప్ర‌పోజ‌ల్ పెట్టార‌ట‌.అదేంటంటే… త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌సభ ఎన్నిక‌లలో టీడీపీకి రెండు బెర్త్‌లు క‌న్‌ఫ‌మ్‌కానున్నాయి.

దాంతో ఈ పోస్టులలో ఒకటి తన అన్నయ్యకి ఇవ్వాలని అడిగాడట పవన్.

అయితే చంద్రబాబు కీ ఇలాంటి ఆబ్లిగేషన్స్ చాలానే ఉంటాయి దాంతో పవన్ కోరికని సున్నితంగా తిరస్కరిచాడట చంద్రబాబు.

అయితే ఈ విషయంలో తనని ఇబ్బంది పెట్టవద్దని.నేను ఈ విషయంలో ఫుల్ క్లారిటీ తో ఉన్నానని చెప్పారట బాబు గారు అంతేకాదు ఎవరిని తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ సర్వే పేర్లు కూడా పవన్ కి చూపించారట.

ఈ స‌ర్వేలో ఒక సీటును లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణకు ఎక్కువ మార్కులు ప‌డ్డాయ‌ట‌.ఆయ‌న అయితే ఏపీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగా వాయిస్ వినిపిస్తార‌ని, ఏపీకి కొంత‌యినా న్యాయం జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ట‌.

దీంతో, ఒక సీటును జేపీకి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపార‌ట‌.

ఇదిలా ఉంటే రెండవ సీటుని చిరంజీవికి ఇస్తే బాగుంటుందా అనే విషయంపై కూడా సర్వే చేశారట కానీ అనూహ్యంగా సర్వేలో వచ్చిన నెగిటివ్ మార్కులని పవన్ కి చూపించి ఇలా ఉంటే ఎలా ఇస్తామని అన్నారట చంద్రబాబు.

రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేక‌పోవ‌డం.రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం.అందరికీ తెలిసిన విషయమే.ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు సో ఈ విషయంలో మాట ఇవ్వలేను అని అన్నారట చంద్రబాబు.

అయితే చంద్రబాబు మాత్రం రెండు మూడు అంశాలలో కొంచం పాజిటివ్ గా ఉన్నా ఏదన్నా సాయం చేసేవారు కానీ ఒక్క పాజిటివ్ మార్క్ కూడా పోవడంతో ఇప్పుడు ఏమి చేయలేనని అన్నారట చంద్రబాబు.ఈ విషయం ఎంతవరకూ నిజమో తెలియదు కానీ మొత్తానికి ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube