బాబూ....జగన్ అంటే ఇంత భయమా..??     2018-11-09   15:18:12  IST  Surya Krishna

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఒక బలమైన పార్టీగా తెలంగాణలో చక్రం తిప్పింది.. చంద్రబాబు తన ఆలోచనలు శక్తియుక్తులు, టెక్నాలజీ, సమస్తం హైదరాబాద్ వేదికగా చేసుకుని అభివృద్ధి జరిపించారు. తన సొంత జిల్లా కంటే కూడా చంద్రబాబుకు అప్పట్లో తెలంగాణపై మంచి పట్టు ఉండేది. అయితే ఇప్పటి పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో టీడీపీ ని బ్రతికించుకోవడానికి మళ్లీ ఎప్పటికైనా పునర్వైభవం సాధించుకోవడానికి శత్రువు లాంటి కాంగ్రెస్ పార్టీతో కూడా జత కట్టే పరిస్థితి దిగజారి పోయింది. బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలంగాణలో ఇప్పుడు పట్టుమని పది సీట్లు కాంగ్రెస్ పార్టీని అడగలేని పరిస్థితిలో బాబు ఉన్నారు .. అంతేకాదు కాంగ్రెస్ చెప్పే ప్రతి మాటకు తను ఒకే చెప్పడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి చంద్రబాబుది..

Is Chandrababu Naidu Fearing About YS Jagan-

Is Chandrababu Naidu Fearing About YS Jagan

అయితే చంద్రబాబు ఎందుకు ఇంతటి పరిస్థితికి దిగజారి పోయారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డేనని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఏపీలో జగన్ సీఎం అయితే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అండ గనక తనకు లేకపోతే, అవినీతి కేసులు తనపై మోపుతారు, ఓటుకు నోటు అస్త్రాల ద్వారా అరెస్టులు చేస్తారేమోనని ఆందోళనలో చంద్రబాబు ఉన్నారట. అందుకే టీడీపీ శ్రేణులకు నచ్చకపోయినా సరే కాంగ్రెస్ చెప్పింది చెప్పినట్టు గా బాబు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పెట్టిన ప్రతీ కండిషన్ కి చంద్రబాబు ఊ కొడుతున్నారట. అసలు తెలంగాణా లో ప్రజాదరణ లేని సిపిఐ, కోదండరాం పార్టీ కాంగ్రెస్ ని బెదిరించినట్లుగా సీట్ల విషయంలో డిమాండ్ చేస్తుంటే, తెలంగాణలో ఆంధ్రా ఓట్ల పై పట్టు ఉండీ , ఒక బలమైన టిడిపి క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం కాంగ్రెస్ ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లకే ఓకే చెప్పడం వారి ఊహాగానాలకి మరింత ఊతం ఇస్తోంది.

Is Chandrababu Naidu Fearing About YS Jagan-

అయితే తెలంగాణ టిడిపి నేతలు మొత్తం 17 సీట్లు కావాలని అందుకు కాంగ్రెస్ ని డిమాండ్ చేయమని అధినేత చంద్రబాబుతో సమావేశమై చెప్పిన సమయంలో చంద్రబాబు మాత్రం మన లక్ష్యం కేవలం టిఆర్ఎస్ లో ఓడించడం మాత్రమేనని, ఇచ్చిన సీట్లలో గెలవడం పై దృష్టి పెట్టమని చంద్రబాబు ఆదేశించారట..దాంతో షాక్ తిన్న నేతలు ఇక చేసేది లేక అధినేత చెప్పిన దానికి సరే అంటూ అధినేతనే ఫాలో అవుతున్నారట. ఇదంతా కేవలం ఏపీలో జగన్ గెలిస్తే జరిగే పరిణామాలను ఊహించుకుని చంద్రబాబు వేస్తున్న ఎత్తులని, బాబు తనని తానూ కాపాడుకోవడానికి పార్టీని బ్రతికించుకోవడానికి ఈ మార్గం తప్ప మరేది లేదని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలని వెల్లడిస్తున్నారు.