ఆ ఎమ్మెల్యేను బాబు ప‌క్క‌న పెట్టేశారా… టీడీపీలో హాట్ టాపిక్‌…!  

chandrababu naidu avoiding that TDP MLA TDP, Chandrababu Naidu, Payyavula Keshavu, PAC Chairman Post, - Telugu Cbn, Chandra Babu Naidu, Hot Topic, Hot Topic In Tdp, Neglecting, Payavula Keshav, Tdp, Tdp Leaders, Uravakonda

ఏపీలో విప‌క్ష తెలుగుదేశం పార్టీలో ఎప్ప‌టి వ‌ర‌కు ఏ ఎమ్మెల్యే ఉంటారో ? అర్థం కాని ప‌రిస్థితి.ఇప్ప‌టికే న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.

TeluguStop.com - Is Chandrababu Avoiding That Mla Hot Topic In Tdp

ఇప్పుడు ఇదే లిస్టులో మ‌రో ఆరేడుగురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి.చివ‌ర‌కు చంద్ర‌బాబు ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్న ఎమ్మెల్యేలు కూడా పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

ఇదిలా ఉంటే పార్టీలో కీల‌క నేత‌, సీనియ‌ర్ అయిన ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌కు, చంద్ర‌బాబుకు మ‌ధ్య గ్యాప్ పెరిగిందా ? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి.

TeluguStop.com - ఆ ఎమ్మెల్యేను బాబు ప‌క్క‌న పెట్టేశారా… టీడీపీలో హాట్ టాపిక్‌…-Political-Telugu Tollywood Photo Image

ఇటీవ‌ల చంద్ర‌బాబు పార్టీలో ప‌లువురు కీల‌క నేత‌ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

కీల‌క‌మైన రాష్ట్ర క‌మిటీని, పొలిట్ బ్యూరో, జాతీయ ప‌ద‌వుల‌ను కేటాయించారు.ఈ క‌మిటీల్లో ఎంతో మంది సీనియ‌ర్ల‌కు, బ‌ల‌మైన వాయిస్ వినిపించే నేత‌ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

అయితే ప‌య్యావుల‌ను బాబు ప‌ట్టించుకోలేదు.గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత కూడా పార్టీకి ఉన్న ఏకైక కేబినెట్ ర్యాంకు ప‌ద‌వి అయిన పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని ప‌య్యావులకు క‌ట్ట‌బెట్టారు.

బాబు కీల‌క ప‌ద‌విని ప‌య్యావుల‌కు ఇచ్చినా ఆయ‌న మాత్రం పార్టీ త‌ర‌పున వాయిస్ వినిపించ‌డం లేదు.కీల‌క ప‌ద‌విలో ఉండి కూడా ప్ర‌భుత్వ అక్ర‌మాలు, ఇసుక దోపిడీ, గ‌నుల అక్ర‌మాల‌పై ప‌య్యావుల మ‌త్రం ఒక్క‌సారి కూడా మాట్లాడ‌లేదు.

ఈ అవినీతిపై ఆయ‌న ఒక్క‌సారి కూడా స‌మావేశం నిర్వ‌హించ‌లేదు.దీనికి తోడు తెలంగాణ‌లో ఉన్న వ్యాపారాల నేప‌థ్యంలో కూడా ఆయ‌న అధికార పార్టీ నేత‌ల‌తో అంట కాగుతున్నార‌న్న సందేహాలు సొంత పార్టీ నేత‌ల‌కు ఉన్నాయి.

ఇటు ప‌య్యావుల కూడా పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు త‌న‌ను ప‌ట్టించుకోలేద‌న్న భావ‌న‌తో ఉన్నారు.ఏదేమైనా కేశ‌వ్‌పై బాబు ఆగ్ర‌హంతో ఉన్నందునే ఆయ‌న‌కు ఏ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టలేద‌ని.

అందుకే ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశార‌న్న టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పుడు ఈ విష‌యం పార్టీ వ‌ర్గాల్లో బాగా హైలెట్ అయింది.

#TDP Leaders #Payavula Keshav #Neglecting #Hot Topic #Uravakonda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Chandrababu Avoiding That Mla Hot Topic In Tdp Related Telugu News,Photos/Pics,Images..