ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న యంగ్ బ్యూటీ.... కానీ...

ప్రస్తుతం బాలీవుడ్ మోడలింగ్ రంగంలో యంగ్ బ్యూటీ సాక్షి మాలిక్ దూసుకుపోతోంది.అయితే ఈ అమ్మడు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోయినప్పటికీ ఈ అమ్మడి పేరు మాత్రం బాగానే పాపులర్ అయ్యింది.

 Is Bollywood Model Sakshi Malik Breakup With Her Boyfriend, Bollywood Model, Sak-TeluguStop.com

కాగా ఆ మధ్య తెలుగులో నేచురల్ స్టార్ నాని మరియు ప్రముఖ హీరో సుధీర్ బాబు హీరోలుగా నటించిన “వి” చిత్రంలో ఈ అమ్మడు పేరుని ఓ సన్నివేశంలో ఉపయోగించడంతో సాక్షి మాలిక్ ఏకంగా తన పేరు తప్పుగా ఉపయోగించారంటూ కోర్టులో పిటిషన్ వేసింది.దీంతో వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఈ అమ్మడి పేరుని తొలగించారు.

ఆ విధంగా సాక్షి మాలిక్ తెలుగు సినీ ప్రేక్షకులకి సుపరిచితమే.

కాగా మోడల్ సాక్షి మాలిక్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన “సభ్తుల్ కటారా” అనే నటుడితో ప్రేమలో పడింది.

దీంతో గత కొద్ది కాలంగా వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ మధ్య సాక్షి మాలిక్ సోషల్ మీడియా బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో పాటు తనకు సంబంధించిన సమాచారాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది.అయితే తాజాగా సాక్షి మాలిక్ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది.

అంతేగాక ఈ ఫోటోకి “మిస్ యు క్యూటీ” అని క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో గత కొద్ది కాలంగా నటి సాక్షి మాలిక్ తన ప్రియుడుకి మధ్య మనస్పర్ధలు, విభేదాలు కారణంగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.

కానీ నటి సాక్షి మాలిక్ మాత్రం ఇప్పటివరకు తన ప్రియుడితో బ్రేకప్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి సాక్షి మాలిక్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఫిదా అయిన కొంతమంది దర్శక నిర్మాతలు స్పెషల్ సాంగ్స్ లో నటించే ఆఫర్లను ఇస్తున్నప్పటికీ సాక్షి మాలిక్ మాత్రం తన సినీ కెరియర్ ని దృష్టిలో ఉంచుకొని స్పెషల్ సాంగ్స్ కి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube