బీజేపీ హ్యాట్రిక్ సాధ్యమేనా..? మోదీ షా వ్యూహం ఏంటి..?

కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత 2014 లో సింపుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది.దేశంలోని చాలా రాష్ట్రాల్లో పాగా వేసింది.కొన్ని చోట్ల గవర్నర్ ను పావులా వాడి అధికారం చేజిక్కించుకుంటే.మరి కొన్ని రాష్ట్రాల్లో పార్టీ నేతల్ను బుజ్జగించి.అధికారం కైవసం చేసుకున్నారు.

 Is Bjp's Hat-trick Possible What Is Modi Shah's Strategy , Bjp, Lok Sabha Electi-TeluguStop.com

గతంలో ఇందిరా గాంధీ మాదిరిగా ఒకే సారి రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్క సంతకంతో రద్దు చేయకుండా.రాజ్యాంగ బద్దంగా కూల్చుతూ.కాషాయ కోటను కడుతూ వచ్చింది.

2019 ఎన్నికల్లో ఏ ప్రాంతీయ పార్టీ అవసరం లేకుండానే 300 పై చిలుకు సీట్లను గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.రాజ్యసభలోనూ తన బలాన్ని పెంచుకుని.పార్టీ సిద్దాంతాలకు సంబంధించిన చాలా బిల్లులను నెగ్గించుకుంది.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను సైతం నెగ్గించుకుంది.అంతే కాకుండా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న జమ్ము కశ్మీర్ అంశాన్ని ఏకంగా మేనిఫెస్టోలో చేర్చి.

చెప్పించే చేసేసింది.భద్రత, సౌకర్యాలు, టెక్నాలజీ విషయంలో మాత్రం కొంత దూకుడుగా వ్యవహరించింది.

Telugu Akhalidal, Bjp Hyatric Win, Cm Jagan, Jp Nadda, Lok Sabha, Pm Modi-Politi

రాబోయేది ఎన్నికల కాలం కావడంతో.ఇప్పటి నుంచే ఆ పార్టీ ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది.రాబోయే 9 రాష్ట్రాల ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాలను గుప్పెట్లో ఉంచుకోవాలని ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది.అందుకే చాలా చోట్ల అధ్యక్షుల పదవి కాలాలను పొడగించారు.తన స్వతం బలం ఈ సారి రాకపోతే.ముందస్తుగా.

కొన్ని పార్టీలను మద్దతు ఇచ్చేలా చూసుకోవాలని.ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో ఆ పార్టీలు చేరకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ దేశంలోని 28 పార్టీలను ఆహ్వానించి.ఒకే తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

బీజేపీకి మాత్రం పంజాబ్ లోని అకాళీదళ్, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, ఒడిశా నవీన్ పట్నాయక్, ఏపీలోని జగన్, బీహార్, యూపీ లోని కొన్ని పార్టీల మద్దతు ఉంటుందని భావిస్తున్నారు.

Telugu Akhalidal, Bjp Hyatric Win, Cm Jagan, Jp Nadda, Lok Sabha, Pm Modi-Politi

అందులో భాగంగా ఆయా పార్టీల అధినేతలతో.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంతనాలు జరుపుతున్నారు.ఒక వేళ ఏ మాత్రం సీట్లు తగ్గినా కూడా.

చిన్నా చితకా పార్టీల సాయంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.ఇంతవరకూ మన దేశంలో ఏ ప్రధాని మూడు సార్లు వరుసగా పదవి తీసుకోలేదు.

ఆ రికార్డును ప్రధాని మోదీ చేత లిఖించాలని బీజేపీ భావిస్తోంది.మరి బీజేపీ కల నెరవేరుతుందా లేదా అనేది తేలాలంటే ఎన్నికలు రావాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube