టీఆర్ఎస్ కు బలంగా నిలిచిన వర్గాలే బీజేపీ టార్గెట్టా?

టీఆర్ఎస్ ప్రభుత్వం పై భారతీయ జనతా పార్టీ రోజురోజుకు మాటల తూటాలు పేల్చుతూ క్షేత్ర స్థాయి కార్యకర్తలు నిర్మాణం జరుపుతూ రోజురోజుకు బలంగా తయారవుతోంది.అయితే సరిగ్గా సంవత్సరం క్రితం తెలంగాణలో ఏమాత్రం పట్టు లేని బీజేపీ ఒక్కసారిగా క్రిందపడిన అల ఎగసి పడ్డట్లుగా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడింది.

 Is Bjp The Target Of Trs Strongholds-TeluguStop.com

అయితే చాప క్రింద నీరులా రకరకాల వ్యూహాలతో పట్టు సాధిస్తూ వచ్చారు.అయితే ఎవరైతే కేసీఆర్ కు బలంగా ఉండి అధికారంలోకి రావడానికి దోహదపడ్డారో, వాళ్ళకు ఇచ్చిన హామీలను నెరేవేర్చలేదని చెప్పి, వారితోనే కేసీఆర్ కు చెక్ పెట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకరిని ఉదాహరణగా మనం తీసుకుంటే గొల్లకురుమలు అంతరించిపోతున్న వారి వృత్తిని తిరిగి నిలబెట్టే ప్రయత్నంలో సబ్సిడీ క్రింద గొర్రెలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.అయితే మరల పంపిణీ చేయడం ఆలస్యం కావడంతో గొల్లకురుమల తో కలిసి ధర్నాలు చేయించడం, ఆ ధర్నాలకు బీజేపీ నాయకత్వం వహించడంతో వాళ్లని ఉసగొల్పడం ద్వారా వారి మద్దతు కేసీఆర్ కు లభించకుండా చేయాలన్నది బీజేపీ వ్యూహం.

 Is Bjp The Target Of Trs Strongholds-టీఆర్ఎస్ కు బలంగా నిలిచిన వర్గాలే బీజేపీ టార్గెట్టా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ప్రతి ఒక్కవర్గాన్ని కేసీఆర్ పై ఉసిగొల్పి లబ్ధిపొందాలన్నది బీజేపీ ప్రధాన వ్యూహంలా కనిపిస్తోంది.ఇప్పటికే కొన్ని వర్గాలలో అసంతృప్తి నెలకొందని గ్రహించిన బీజేపీ ఈ రకమైన వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యూహం గనుక విజయం సాధిస్తే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Bandi Sanjay, Shepherds Protest, Tactics, Telangana Bjp, Telangana Politics-Telugu Political News.

#Bandi Sanjay #@BJP4Telangana #Tactics #Telangana BJP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు