ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ బలపడుతోందా?

తెలంగాణలో బిజెపి రోజురోజుకు బలపడుతోంది దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బలపడాలని బిజెపి కార్యాచరణ రూపొందించుకుని విషయం తెలిసిందే అందులో భాగంగానే ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎండగడుతూ టిఆర్ఎస్ తర్వాత రెండో ప్రధాన పాత్రగా ఎదిగేందుకు ప్రజల్లో ఉండేందుకు ఎక్కువ శాతం ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు బిజెపిని క్షేత్రస్థాయిలో బలపరిచేందుకు కార్యకర్తలకు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అయితే బండి సంజయ్ ప్రజాసంకల్పయాత్ర పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లో కలవరం సృష్టిస్తుంది రాష్ట్రంలో బీజేపీ వైపు పెద్ద ఎత్తున ప్రజలు చూసే అవకాశం ఉందని భావించినా ప్రజా సంకల్ప యాత్రకు మాత్రం ఆశించినంత స్పందన రావడం లేదు.

 Is Bjp Strengthening With Praja Sangram Yatra-TeluguStop.com

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ లో ప్రజా సంగ్రామ యాత్ర ముగించేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నా సరిగ్గా ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు నిరుత్సాహ పడ్డారు.

అంతేకాక ప్రజా సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ ను పెద్ద దెబ్బ కొట్టవచ్చు అని బీజేపీ వ్యూహం పన్నినా ప్రజా సంగ్రామ యాత్ర విఫలమవడంతో బీజేపీ ఇప్పుడు మరో ప్లాన్ కోసం వెతుకుతోంది.

 Is Bjp Strengthening With Praja Sangram Yatra-ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ బలపడుతోందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీకి జరుగుతున్న లాభం ఏంటంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ పార్టీ అంటే ప్రజలకు తెలుస్తోంది.మామూలుగా బీజేపీ అంటే పెద్దగా సాధారణ ప్రజలకు తెలియదు.కాని టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేంత స్థాయిలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతున్నదని చెప్పడానికి లేదు.

కనీసం బండి సంజయ్ విమర్శలకు టీఆర్ఎస్ నుండి అసలు స్పందనే రావడం లేదు.అటువంటప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి ఉపయోగం ఏమి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

#Huzurabad #Bjp #@BJP4Telangana #Etala Rajander #Bandi Sanjay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు