తెలంగాణ‌లో బీజేపీ ఓవ‌ర్ గా థింక్ చేస్తోందా..?

తెలంగాణ‌లో క‌మ‌ల‌నాథులు జోరు పెంచారు.వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

 Is Bjp Overthinking In Telangana, Bjp, Telangana, Modi, Ameeth Shah, Kishan Redd-TeluguStop.com

పార్టీ పెద్దలను తీసుకొస్తూ.శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు కూడా.పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

 Is BJP Overthinking In Telangana, BJP, Telangana, Modi, Ameeth Shah, Kishan Redd-TeluguStop.com

ఇక ప్ర‌స్తుతం బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు హైద‌రాబాద్ వేదిక జ‌రుగుతున్నాయి. బీజేపీ కీల‌క నేత‌లందరూ తెలంగాణ‌లో దిగిపోయారు.

ప్ర‌ధాని మోడీ విచ్చేశారు.అయితే ఈ ప్ర‌భావం అంతా అర్బ‌న్ ఏరియాల్లో ఉంటుందేమో కానీ గ్రామాల్లో ఉండ‌ద‌ని అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ పెద్ద‌గా ప్ర‌భావం చూపింది ఏమిలేదు.కాక‌పోతే తెలంగాణ‌లో పుంజుకుంటోంది అన్నది వాస్త‌వం.

అంత‌మాత్రాన అధికారంలోకి వ‌చ్చేస్తార‌ని అనుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు సాధ్య‌ప‌డుతుంద‌ని అంటున్నారు.తెలంగాణ రాజ‌కీయాల్లో ఈ సారి ఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు కీల‌కంగా మార‌నున్నాయి.

అధికారం మాదే అని చెప్పుకుంటున్నాయి.ఈ విష‌యంలో బీజేపీ మ‌రీనూ.

ఈ పార్టీకి గ్రౌండ్ స్థాయిలో బ‌ల‌మైన క్యాడ‌ర్ లేద‌న్న‌ది వాస్త‌వం.అలాగే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు కూడా లేర‌ని టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ చేస్తున్న విమ‌ర్శే.

అయినా క‌మ‌ల‌నాథులు ఏ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నార‌నేది ప్ర‌శ్న‌.అయితే కేవ‌లం రెండు చోట్ల ఉప ఎన్నిక‌లో గెలిచిన ఫ‌లితాల ఆధారంగా ప్ర‌జ‌లు త‌మ వైపే ఉన్నార‌నుకోవ‌డం అత్యాశే అవుతుంది.

అలాగే అర్బ‌న్ ఏరియాలో కొంత పార్టీ సానుభూతిప‌రులు ఉన్న‌ప్ప‌టికీ అన్ని నియోజ‌కవ‌ర్గాల్లో క్యాడ‌ర్ లేద‌న్న‌ది వాస్త‌వం.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో పోల్చి చూస్తే టీఆర్ఎస్ తో త‌ల‌ప‌డింది కాంగ్రెస్ మాత్ర‌మే.

రెండవ స్థానంలో నిలిచిందీ కాంగ్రెస్సే.కేవ‌లం కాంగ్రెస్ నాయకుల అంత‌ర్గ‌తఘ‌ర్ష‌ణ‌.

సరైన వ్యూహాలు లేని కారణంగా కోలుకోలేక‌పోతోంది.అంతేగాని కాంగ్రెస్ ని మించి తెలంగాణ‌లో బీజేపీ ఉంద‌నుకోవ‌డం భ్ర‌మే.

ఇక గులాబీ బాస్ కేసీఆర్ జ‌నా నాడీ తెలిసినోడు.ఏదో విధంగా జ‌నాల‌ను తన వైపునకు తిప్పుకోగ‌ల‌డు.

ఎన్నిక ఎన్నికకూ ఒక కొత్త నినాదం అమ‌లు చేస్తారు.ఇక ఈ సారి ఆయన కమలం పార్టీని బూచిగా చూపించి గ‌ట్టెక్కాల‌ని చూస్తున్నారు.

ఆ నేత‌ల‌ను రెచ్చగొట్టి మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని అంటున్నారు.ఓట్ల చీలిక కోసమే ఈ వ్యూహాన్ని అమ‌లు చేశార‌ని టాక్.

అయితే ఇది అర్థం కాక బీజేపీ లేని బలాన్ని ఊహించుకుంటూ స‌వాల్ విసురుతోంద‌ని అంటున్నారు.

అస‌లు కేసీఆర్ ని ఢీ కొట్టే నేత‌లు బీజేపీలో లేర‌నేది వాస్త‌వం.ఒక‌ప్పుడు ఆలె నరేంద్ర, బద్ధం బాలిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగరరావు వంటి నేత‌లు పార్టీకి బలంగా ఉండేవారు.ఇప్ప‌డు ఆ ప‌రిస్థితి లేరు.

మోడీ పేరు చెప్పుకుని పార్టీ పేరు చెప్పుకునే నేత‌లే ఎక్కువ‌.కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మూడేళ్లుగా తెలంగాణలో పార్టి ప‌టిష్టానికి ఎంతవ‌ర‌కు కృషి చేశార‌నేది ఆలోచించాలి.

ఇక బండి సంజయ్ తీరు చూస్తే మాట దూకుడే ఎక్కువ అన్న విమర్శలూ ఉన్నాయి.అయితే కేవ‌లం మోడీ పేరు చెప్పుకుని క్యాడ‌క్ లేకుండా జనాల్లోకి వెళ్తే.

ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతార‌నేది ప్ర‌శ్న‌.ఎంత‌మంది నేత‌లు వ‌చ్చిపోయినా అప్ప‌టివ‌ర‌కు ఉంటుంది త‌ప్పితే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశాలు క‌నిపించ‌డంలేదు.

ప్ర‌స్తుత సంబ‌రాల‌తో జోష్ నింపినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి ఏంటో వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube