అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచిందా?

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణాన్ని చేపడుతూ వచ్చారు.

 Is Bjp Overconfident-TeluguStop.com

అయితే ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను కలిగించడంలో కొంత మేర విజయవంతమయ్యారని చెప్పవచ్చు.దానికి నిదర్శనమే దుబ్బాకలో గెలుపొందడం, గ్రేటర్ ఎన్నికల్లో 40కి పైగా సీట్లు సాధించడం లాంటివని చెప్పుకోవచ్చు.

అయితే బీజేపీ టీఆర్ఎస్ పై తొందరపడి ఎక్కువగా విమర్శలు చేసిందని బీజేపీలో అంతర్మధనం కొనసాగుతోంది.టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయట్లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజారంజక నిర్ణయాలతో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడడంతో బీజేపీ ప్రజల్లో దోషిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.

 Is Bjp Overconfident-అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే బీజేపీ ఇప్పుడు మౌనం వహిస్తోంది.అందుకే బీజేపీ ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఘోర ఓటమితో బీజేపీకి వాస్తవ పరిస్థితులు అనేవి అర్థమైనట్టు అవగతమవుతున్నాయి.ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంలో బీజేపీ చేసిన ప్రధాన తప్పు ఏంటని ఒకసారి విశ్లేషించుకుంటే ఎమ్మెల్సీ ప్రచారంలో పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తామని కాకుండా అక్కడ కూడా టీఆర్ఎస్ పై తిట్ల పురాణం బీజేపీ గెలవకపోవడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.

టీఆర్ఎస్ ను విమర్శించి ఓటు బ్యాంకు తెచ్చుకోవడం అన్ని సందర్భాలలో సాధ్యం కాదనేది బీజేపీకి బోధ పడిందని చెప్పవచ్చు.

#@BJP4Telangana #@CM_KCR #@JaiKCR29 #@trspartyonline

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు