తెలంగాణ బీజేపీలో( BJP ) రోజుకో చర్చ తెరపైకి వస్తోంది.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న కాషాయ పార్టీ గెలుపు కోసం తప్పని పాట్లు అప్డుతోంది.
ముఖ్యంగా పార్టీని పూర్తి ప్రక్షాళన చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుండడంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకుఒనున్నాయనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా అధ్యక్ష పదవి మార్పుపై గత కొన్నాళ్లుగా చర్చ సాగుతూనే ఉంది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్( Bandi Sanjay ) ను తప్పించి అతని స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఆ మద్య ఈటెల రాజేంద్రకు( etela rajendar ) అధ్యక్ష బాద్యతలు అప్పటించేందుకు అధిస్థానం సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు తాజాగా కిషన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.అయితే ఎన్నికల ముందు అధ్యక్ష పదవి మార్పు చేపడితే.
ఆ ప్రభావం పార్టీపై ఎక్కువగా చూపించే అవకాశం ఉండడంతో అధ్యక్ష మార్పు ఉండదని టాక్ నడిచింది.కాగా తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అధ్యక్ష పదవి మార్పు గ్యారెంటీ అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ నెల 8న ప్రధాని మోడీ( Prime Minister Modi ) తెలంగాణకు రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాని సభకు తాను అధ్యక్షుడిగా వస్తానో లేదో అంటూ స్వయంగా బండి సంజయే అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో అధ్యక్షుడిని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది నిజమేనని తేటతెల్లమైంది.

ఏ ఏడాది అయిదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను( Assembly elections ) దృష్టిలో ఉంచుకొని కొన్ని రాష్ట్రాలలో కీలక మార్పులు చేయాలని కమలం పార్టీ అధిష్టానం గట్టిగానే ఆలోచన చేస్తోంది.ఈ నేపథ్యంలో తెలంగాణ విషయంలో మార్పులు చేయాలా వద్దా అనే దానిపై తర్జన భర్జన పడుతోందట.అయితే తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పిస్తే సిఎం అభ్యర్థిగా అతని పేరే పరిశీలించే అవకాశం ఉంది.
అలా కాకుండా అధ్యక్ష పదవిలో బండి సంజయ్ నే ఉంచితే సిఎం అభ్యర్థిగా మరో వ్యక్తి పేరును పరిశీలించే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోందట.మొత్తానికి బీజేపీలోని తాజా పరిణామాలు చూస్తుంటే అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగడం కష్టమే అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.