హుజురాబాద్ ఉప ఎన్నికలో బహుముఖ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.అయితే బీజేపీకి టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న తరుణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గాల పై బీజేపీ దృష్టి పెట్టింది.

 Is Bjp Implementing A Multi Pronged Strategy In The Huzurabad By Election-TeluguStop.com

ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నవారిని హుజూరాబాద్ లో బీజేపీ గెలుపుకు, టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతను పెంచడానికి ఉన్న అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ దళిత బంధుతో బీజేపీని ఇరుకున పెట్టాలని వ్యూహాన్ని రచిస్తే బీజేపీ అష్టదిగ్భందన వ్యూహాన్ని రచిస్తూ టీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టాలని యోచిస్తోంది.

అయితే బీజేపీ ప్రయోగిస్తున్న అష్టదిగ్భందన  వ్యూహాన్ని ఒక సారి పరిశీలిస్తే టీఆర్ఎస్ విమర్శలను బలంగా తిప్పుకొడుతూ, మేధావి వర్గాలు సైతం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కలిగి ఉన్న విషయం విదితమే.

 Is Bjp Implementing A Multi Pronged Strategy In The Huzurabad By Election-హుజురాబాద్ ఉప ఎన్నికలో బహుముఖ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bjp Party, Huzurabad Byelections, Is Bjp Implementing A Multi-pronged Strategy In The Huzurabad By-election, Telangana Politics, Trs Party-Political

అందుకే హుజూరాబాద్ ప్రచారం చివరి దశలో ఉన్న తరుణంలో మేధావులతో కూడా ప్రచారం చేయిస్తూ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ గెలుపుకు అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పై ఎంతగా వ్యతిరేకతను పెంచడంలో విజయవంతమయితే అంతగా బీజేపీకి లాభం జరుగుతుంది.ఏది ఏమైనా బీజేపీ, టీఆర్ఎస్ వేస్తున్న వ్యూహ, ప్రతివ్యూహాలు రోజు రోజుకు ఎన్నిక పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయి.

అయితే ఒకవేళ బీజేపీ ఓటమి చెందితే ఈటెలకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటిగా అంతర్గత ఒప్పందంతో పోటీకి దిగుతున్నారన్న ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఫలితంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.

అయితే దుబ్బాక తరహాలో బీజేపీ విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా మరొక్క సారి చర్చనీయాంశంగా మారుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

#Trs #BJPMulti #Telangana #Bjp #Huzurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube