బాబోయ్‌ ఏంటీ ఈ గందరగోళం.. ఇంతకు చత్రపతి ఉందా? లేదా?  

is bellamkonda sai srinivas hindi chatrapathi there or not, bellamkonda sai srinivas, bollywood chatrapathi, chatrapathy, prabhas, rajamouli, sujith - Telugu Bellamkonda Sai Srinivas, Bollywood Chatrapathy, Chatrapathy, Prabhas, Rajamouli, Sujith

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా బాలీవుడ్‌లో చత్రపతి సినిమా రీమేక్‌ అవ్వబోతుంది అంటూ గత వారం పది రోజులుగా మీడియాలో పతాక స్థాయిలో వార్తలు వస్తున్నాయి.ఈ విషయమై చాలా అంచనాలు ఆసక్తి ఉంది.

TeluguStop.com - Is Bellamkonda Sai Srinivas Hindi Chatrapathi There Or Not

ప్రభాస్‌ రాజమౌళి కాంబోలో వచ్చిన అద్బుతాన్ని రీ క్రియేట్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు.ప్రభాస్‌ స్థాయి క్రేజ్‌ స్టామినా ఉండాలి.

జక్కన్న స్థాయి క్రియేటివిటీ ఉండాలి.అలాంటి దర్శకుడు హీరో హిందీలో ఉన్నారా అనుకుంటూ ఉండగా బెల్లంకొండ తాను ఉన్నాను అంటూ బాలీవుడ్‌ బాట పట్టే ప్రయత్నం చేశాడు.

TeluguStop.com - బాబోయ్‌ ఏంటీ ఈ గందరగోళం.. ఇంతకు చత్రపతి ఉందా లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కాని అతడి బాలీవుడ్‌ జర్నీ అంతా గందరగోళంగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది.చత్రపతి రీమేక్‌ కోసం సుజీత్‌ ను భారీ ఆఫర్‌ చేసి మరీ ఒప్పించే ప్రయత్నం చేశారు.

కాని సాహో తర్వాత యూవీ వారితో కమిట్‌ అయిన ఆయన చత్రపతి సినిమాకు నో చెప్పాడు.

తెలుగులో ఈయన నటించిన సినిమాలు ఏమీ సూపర్‌ హిట్‌ అవ్వకున్నా కూడా నమ్మకంతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టేందుకు సిద్దం అయ్యాడు.

బెల్లంకొండ బాలీవుడ్‌ అంటే కొందరు జోకులు వేస్తున్నారు.మరి కొందరు సీరియస్‌ గానా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు.మొత్తానికి బెల్లంకొండ చత్రపతి సినిమా పట్టాలు ఎక్కే వరకు ఎవరు నమ్మే పరిస్థితి అయితే కనిపించడం లేదు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తో సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్న ఆ దర్శకుడు ఎవరు అనే మాత్రం తెలియడం లేదు.

సుజీత్‌ నో చెప్పడంతో ఆ బాధ్యతలను ప్రభుదేవాకు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.కాని ప్రస్తుతం ఆయన వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.

అందుకే ఈ రీమేక్‌ కు ఓకే చెప్పేందుకు ఆయన సిద్దంగా లేడు అంటూ టాక్‌ వినిపిస్తుంది.ఇంతకు ఈ రీమేక్‌ కు దర్శకత్వం చేసేది ఎవరు అనే అనుమానాలు గందరగోళం మద్య అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

#Rajamouli #Chatrapathy #Prabhas #BellamkondaSai #Sujith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Bellamkonda Sai Srinivas Hindi Chatrapathi There Or Not Related Telugu News,Photos/Pics,Images..