అనుష్క ‘నిశ్శబ్దం’కు కారణం ఏంటో?  

is anushka against for nishabdam ott release Anushkha, Nishabddam, OTT, Amazon Prime, Bengaloore, Hyderabad, Hemanth Madhukar, Movie Theaters - Telugu Amezon Prime, Anushka, Kona Venkat, Nishabdam, Telugu Film News

అనుష్క భాగమతి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నటించిన సినిమా నిశ్శబ్దం.అనుకోని కారణాల వల్ల గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలో విడుదలకు సిద్ధమైంది.

TeluguStop.com - Is Anushka Againsts For Nishabdam Ott Release

కానీ కరోనా వల్ల విడుదల చివరి నిమిషంలో వాయిదా వేశారు. థియేటర్లు ఓపెన్ అయితే ఈ సినిమాను విడుదల చేయాలని ఎదురు చూసిన చిత్ర యూనిట్ సభ్యులకు నిరాశే మిగిలింది.

గత ఆరు నెలలుగా థియేటర్లు మూత పడే ఉండటం మరి కొన్నాళ్ళ పాటు థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేని కారణంగా సినిమాను నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.

TeluguStop.com - అనుష్క నిశ్శబ్దం’కు కారణం ఏంటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నిశ్శబ్దం సినిమా ఓటీటీ విడుదలను మొదటి నుండి అనుష్క వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ కారణంగానే ఇప్పుడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంటున్నారు.ఆమె కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఒక వర్గం వారి ఆరోపణ.

యూనిట్‌ సభ్యులు అంతా అనుకున్న తర్వాతే సినిమాను అమెజాన్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.ఇది ఏ ఒక్కరి సొంత నిర్ణయం కాదంటూ ఇటీవలే దర్శకుడు హేమంత్ మధుకర్ అన్నాడు.

అనుష్క ప్రమోషన్ విషయంలో యాక్టివ్ గా లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూనిట్‌ సభ్యులు స్పందిస్తూ అంతా బాగానే ఉందని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

థియేటర్లలో సినిమా విడుదల అయ్యే సమయంలో చేసే ప్రమోషన్‌ కు ఓటీటీ ప్రమోషన్‌ కు తేడా ఉంటుందని నిశ్శబ్దం యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్ విషయంలో యాక్టివ్ గా వ్యవహరించడం లేదు అంటున్నారు.

కరోనా సమయంలో ప్రయాణాలు కష్టంగా ఉన్న కారణంగా అనుష్క బెంగళూరు నుంచి హైదరాబాదుకు రావడం ఇబ్బందిగా ఉంది.అందుకే నిశ్శబ్దం సినిమా ప్రమోషన్ కి సోషల్ మీడియా ద్వారానే సహకరిస్తున్నట్లు గా సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అంతే తప్ప నిశ్శబ్దం యూనిట్ సభ్యులతో అనుష్క కు ఎలాంటి విభేదాలు లేవని నిర్మాతలు తెలియజేశారు.

#Kona Venkat #Anushka #Amezon Prime #Nishabdam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Anushka Againsts For Nishabdam Ott Release Related Telugu News,Photos/Pics,Images..