ఆ డైరెక్టర్ తో యాంకర్ వర్షిణి పెళ్లి ఆగిపోయిందా..?

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్, ఢీ తదితర షోలలో యాంకరింగ్ నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి సౌందరాజన్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పలు చిత్రాలలో కూడా నటించింది.

 Is Anchor Varshini And Telugu Director Marriage Cancelled-TeluguStop.com

కానీ ఆ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.కానీ బుల్లితెర పై మాత్రం పలు షోలు, ఈవెంట్లలలో నటిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా యాంకర్ వర్షిణి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఇందులో యాంకర్ వర్షిణి ఓ వ్యక్తితో కలిసి దిగినటువంటి ఫోటోని తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 Is Anchor Varshini And Telugu Director Marriage Cancelled-ఆ డైరెక్టర్ తో యాంకర్ వర్షిణి పెళ్లి ఆగిపోయిందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఫొటోలో వర్షిణి తో పాటూ ఉన్నటువంటి వ్యక్తి ముఖం మాత్రం కనిపించలేదు. దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ యాంకర్ వర్షిణి  ప్రస్తుతం ప్రేమలో పడిందని తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కానీ యాంకర్ వర్షిణి  మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించడం లేదు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలోకూడా వర్షిణి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుందని ఇందులో భాగంగా వీరిద్దరూ 2017వ సంవత్సరంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి.

కానీ అనుకోకుండా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ నిశ్చితార్థం క్యాన్సల్ అయిందని టాక్ వినిపిస్తోంది.కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి కూడా యాంకర్ వర్షిణి స్పందించక పోవడం గమనార్హం.

మరి ఇప్పటికైనా యాంకర్ వర్షిణి తన ప్రేమ, పెళ్లి విషయాలపై వస్తున్నటువంటి వార్తలు గురించి స్పందిస్తుందో లేదో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ వర్షిణి  పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే షోలు, ఈవెంట్లు, చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

అంతేకాకుండా తాజాగా ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

#Varshini #IsAnchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు