అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల బిగ్‌సేల్‌ ఆఫర్ల వెనుక మతలబు ఏంటో తెలిస్తే షాక్‌ అవుతారు

ప్రస్తుతం జనాలు బజారుకు వెళ్లి షాపింగ్‌ చేయడం ఎప్పుడో మానేశారు.అంతా కూడా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు.

 Is Amazon And Flipkart Big Billion Day Sale Offers True Or Fake-TeluguStop.com

ప్రతి ఒక్కటి కూడా ఆన్‌లైన్‌లోనే లభిస్తుండటంతో అంతా కూడా అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌ లైన్‌ స్టోర్‌లనే ఆశ్రయిస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు చేస్తున్న ఈ సమయంలో అమెజాన్‌ మరియు ఫ్లిప్‌ కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.10 నుండి 90 శాతం వరకు డిస్కౌంట్స్‌ ఇస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాయి
ఫెస్టివల్‌ సమయంలో ఈ రెండు సంస్థలు ఇచ్చే ఆఫర్లు వినియోగదారులను ఆశ్చర్యపర్చుతూ ఉంటాయి.20 వేల మొబైల్‌ కేవలం 15 లేదా 10 వేలు మాత్రమే అంటూ వారు ఆఫర్లు ఇస్తూ ఉంటారు.ప్రస్తుతం అమెజాన్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్స్‌ జరుగుతున్నాయి.ఇలాంటి సమయంలో భారీ ఎత్తున కొనుగోల్లు జరుగుతు ఉంటాయి.వేలకు వేలకు ఆఫర్లు ఇస్తూ ఉంటారు.ఈ ఆఫర్ల వల్ల వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

Telugu Amazon, Big Days, Flipkart, Amazonflipkart, Offers-

అయితే అసలు ఈ ఆఫర్లు ఇంతగా ఎలా ఇస్తున్నారు.ఇంత తక్కువ రేటుకు ఇవ్వడం వల్ల అమెజాన్‌ ఫ్లిప్‌ కార్ట్‌ వారికి లాభం ఎలా దక్కుతుంది.వస్తువు అమ్మే వారికి దాని మొత్తం కంటే చాలా తక్కువకు అమ్మడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.పేపర్‌లో యాడ్‌ ఇచ్చినట్లుగా, టీవీలో చూపించినట్లుగా ఆఫర్లు మరీ వేలల్లో ఉండవు.

కేవలం వందల్లో మాత్రమే తగ్గింపు ఉంటుంది.

Telugu Amazon, Big Days, Flipkart, Amazonflipkart, Offers-

వారు 10 నుండి 90 శాతం అన్నా కూడా ఎక్కువ శాతం 10 నుండి 20 శాతం వరకు మాత్రమే ఆఫర్లు ఇస్తూ ఉంటారు.అది కూడా వారికి వర్కౌట్‌ అవుతుంది అనుకుంటేనే ఇస్తారు.ఈ ఆపర్ల ప్రకటన అంతా కూడా ఒక మాయాజాలం అంటూ కొందరు తెలివైన వినియోగదారులు అంటూ ఉన్నారు.

కొందరు మాత్రం ఆ ఆఫర్ల మాయలో పడిపోతున్నారు.ఆఫర్లు ఉన్నాయి కదా అని ఎక్కువ తక్కువ కొనుగోలు చేయడం మంచిది కాదు.

అవసరం ఉన్నంత వరకు కొనుగోలు చేస్తే అదే బెటర్‌.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube