అల్లరి నరేష్( Allari Naresh ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు.నాంది సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత వచ్చిన ఉగ్రం( Ugram ) సినిమాతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.
మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఆయన బచ్చల మల్లి గా ( Bachhala Malli ) ఒక మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే…
అయితే ఈ సినిమా విషయంలో అల్లరి నరేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక లుక్కు విషయం లో పుష్ప 2( Pushpa 2 ) లో అల్లు అర్జున్( Allu Arjun ) లుక్కు మాదిరిగా ఉన్నప్పటికీ ఈ సినిమాని మాత్రం చాలా హై లెవెల్లో తీస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దానికి సంబంధించినట్టుగానే ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ చాలా డీటెయిల్ గా అల్లరి నరేష్ చూసుకొని మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో తప్పనిసరిగా సక్సెస్ ని కొడతారని కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు.మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ కనక సాధిస్తే ఇక అల్లరి నరేష్ ఒక మంచి హీరోగా గుర్తింపు పొందుతాడు…
ఒకప్పుడు ఆయన చేసిన కామెడీ సినిమాలు ఆయనకి ఎంత పేరుని తీసుకొచ్చాయో ఇప్పుడు బచ్చలి మల్లి సినిమాతో మరొక డిఫరెంట్ అటెంప్టు చేయబోతున్నారు కాబట్టి ఈ పాత్రతో కూడా ఆయనకు ఒక మంచి గుర్తింపు రాబోతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడు అనేది… ఇక అల్లరి నరేష్ లాంటి హీరో ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి…
.