ఆ ఇద్దరు హీరోల కోసమే ఇదంతా అంటూ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయినా ఆర్జీవీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ వివాదం జరిగినా వెంటనే స్పందిస్తాడు రామ్ గోపాల్ వర్మ. డైరెక్టర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా బాగా వివాదాస్పదంగా నిలిచాడు.

 Is All This For That Two Heroes Only Ram Gopal Varma Comments On Ap Government D-TeluguStop.com

ఆయన ఏదైనా వివాదంలో తలదూర్చితే చాలు అది వెంటనే హాట్ టాపిక్ గా మారుతుంది.నిజానికి ఆ వివాదానికే మరో వివాదం సృష్టిస్తాడు వర్మ.

కెరీర్ మొదట్లో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.కానీ రాను రాను ఆయన అభిరుచులు మొత్తం మారిపోయాయి.చాలా వరకు కాంట్రవర్సీల సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.ఈయన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీ గా కనిపిస్తాడు.

చాలా వరకు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను బాగా షేర్ చేసుకుంటాడు.

తన సినిమాల గురించి, ఇతర నటీనటుల గురించి బాగా స్పందిస్తూ ఉంటాడు.

ఇక ఏదైనా వివాదం వస్తే చాలు వెంటనే దాని గురించి కూడా రియాక్ట్ అవుతాడు.సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా బయట జరిగే వివాదాల్లో కూడా వర్మ రియాక్ట్ కాకుండా ఉండలేడు.

ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం పై స్పందించాడు వర్మ.

Telugu Ap, Ap Ticket Rates, Rgv, Tollywood-Movie

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో టాలీవుడ్ ఇండస్ట్రీ వివాదం బాగా పాకిందనే చెప్పవచ్చు.గత కొన్ని రోజుల నుండి టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు తగ్గట్లేదు.ఇటీవలే సీఎం జగన్ కూడా టికెట్ల వ్యవహారం గురించి స్పందించారు.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వేడెక్కి పోతుంది.ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల వల్ల పలు చోట్ల థియేటర్లు కూడా మూతపడ్డాయి.

చాలా వరకు పెద్ద పెద్ద సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలన్నీ టిక్కెట్ల రేట్లపై వాయిదా పడగా ప్రస్తుతం వైరస్ నేపథ్యంలో కూడా వాయిదా పడటంతో దీనికి ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వమని టాలీవుడ్ ఇండస్ట్రీ బాగా మండిపడుతుంది.

దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

Telugu Ap, Ap Ticket Rates, Rgv, Tollywood-Movie

అందులో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డాడు.ఎవరికైనా ఒక లిమిటేషన్ ఉంటుందని, ఏమి చేయగలం.ఏమి చేయలేము అనేది ఒక లిమిట్ ఉంటుంది అని అన్నాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా లాంటిది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆ కోవిడ్ ను మనం ఏమి చేయలేం అని.అంతేకాకుండా ఆ ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమీ చేయలేనని నేరుగా అన్నాడు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీపై పలువురు రాజకీయ మంత్రులు చేసిన వ్యాఖ్యల గురించి గురించి కూడా స్పందించాడు.

రెమ్యూనరేషన్ విషయం గురించి మాట్లాడుతూ.నిర్మాతలు ఎవరైనా నష్టాలు వస్తాయి అనే ఉద్దేశంతో భారీ బడ్జెట్ తో సినిమాలు తీయారని అన్నాడు.

ఇక ఆ ఇద్దరు హీరోలను టార్గెట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం దూరం పెడుతున్నారా.లేక వేరే కారణం ఏమైనా ఉందా అన్నది తనకు తెలియదని అన్నాడు వర్మ.

ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోలు ఎవరా అని ఆరాతీస్తున్నారు నెటిజన్లు.మొత్తానికి వర్మ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube