ఆర్.ఆర్.ఆర్ నుంచి ఆమె ఔట్... ఎందుకో... 

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 Is Alia Bhatt Quit To The Rrr Movie-TeluguStop.com

ఈ చిత్రంలో హీరోలుగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.అయితే ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన ఒలివియో మొరిన్ నటిస్తోంది.

అంతేగాక ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తున్నటువంటి అలియా భట్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు పలు వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి.ఉన్నట్లుండి  ఆలియా ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి కారణాలేంటనెది మాత్రం తెలియడం లేదు.

అయితే ఈ వార్త ఎంత వరకు నిజం అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే నెటిజన్లు మాత్రం ప్రస్తుతం అలియాభట్ బాలీవుడ్లో చేతినిండా అవకాశాలు ఉన్నాయని, తన షూటింగ్ డేట్లను మార్చుకోవడంలో ఇటీవల కాలంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందువల్లనే ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే మరి దర్శకుడు జక్కన్న రాజమౌళి ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Telugu Alia Bhatt Rrr, Aliabhatt, Jr Ntr Rrr, Ram Charan Rrr, Rrr, Ssrajamouli-M

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్  దాదాపుగా 40 శాతం పూర్తయింది.కాగా ఈ చిత్రాన్ని మొదట్లో దర్శకుడు రాజమౌళి ఈ ఏడాదిలోని మే నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఇది జనవరి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube