ఆలీ అసంతృప్తితో ఉన్నారా ? జనసేన వైపు వెళ్తున్నారా ?

సినీ కమెడియన్ కమ్ పొలిటీషియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ఎప్పటి నుంచో రాజకీయాల్లో రాణించాలని, ఎమ్మెల్యేగా లేక రాష్ట్రస్థాయి పదవుల్లోనో కూర్చోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Is Ali Unhappy Are You Going Towards Janasena,janasena, Pawan Kalyan, Janasenani-TeluguStop.com

గతంలో టిడిపి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించిన ఆలీకి టికెట్ దక్కలేదు.

ఆ తర్వాత క్రమంలో టిడిపికి దూరమయ్యారు.సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగతంగాను సన్నిహిత సంబంధాలు ఉండడంతో,  ఆలీ జనసేనలో కీలకం గా మారుతారని అంతా భావించినా,  ఆయన మాత్రం అటువైపు వెళ్ళలేదు.

 Is Ali Unhappy Are You Going Towards Janasena,Janasena, Pawan Kalyan, Janasenani-TeluguStop.com

ఓ సందర్భంలో ఆలీని జగన్ పిలిపించి మాట్లాడడం,  ఆ తరువాత వైసిపి కండువా కప్పడంతో పవన్ తో స్నేహాన్ని సైతం వదులుకొని ఆలీ వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు,  కీలకంగా వ్యవహరించారు.  వైసిపి 2019లో అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో,  రాజ్యసభ సభ్యత్వం కానీ, క్యాబినెట్ హోదాతో చైర్మన్ పదవి కానీ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఇప్పటికీ ఆలీ కోరిక నెరవేరలేదు.నెరవేరుతుంది అనే నమ్మకం లేకపోవడంతో కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు.ఏదో రకంగా టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలుపొందాలని,  అది ఏ పార్టీ అయినా ఫర్వాలేదు అన్న ధోరణికి వచ్చేసారు.ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అలీ సొంత ప్రాంతం రాజమండ్రి కావడంతో రాజమండ్రి లేక రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు.ఈ క్రమంలోనే జనసేన వైపు మొగ్గు చూపడానికి కారణంగా తెలుస్తోంది.
 

Telugu Chandrababu, Cine Commendian, Janasena, Janasenani, Pawan Kalyan, Ysrcp-P

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండడంతో తన గెలుపు సులువు అవుతుందని అది కాకుండా పవన్ తోను వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉండడంతో తాను జనసేనలో చేరినా టికెట్ దక్కించుకోవడానికి పెద్దగా ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో ఆలీ ఉన్నట్లు సమాచారం.అయితే  పదవులు దక్కక అలీ అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని వైసిపి సైతం గ్రహించింది.పార్టీ మారకుండా చూసే ప్రయత్నం వైసిపి చేపట్టింది.ఇప్పటికిప్పుడు ఆలీకి ఏదైనా కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తే తప్ప ఆయన వైసిపి లో ఉండే ఛాన్స్ కనిపించడం లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.

వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు అలీ ప్రయత్నిస్తే పవన్ ఆలీకి స్వాగతం పలుకుతారా లేక నో ఎంట్రీ బోర్డ్ పెడతారా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube