మళ్ళీ లాక్ డౌన్ రాబోతోందా...?

ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఈ కరోనా మహమ్మారి ఒక్కసారిగా మానవ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది.అంతేకాక ఈ మహమ్మారి దాదాపుగా ఏడాది కాలం పాటు తన ఉగ్రరూపాన్ని దాల్చుతూ దాడి చేస్తున్నప్పటికీ ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

 Is Again Lockdown In India, Lockdown News, Corona Virus, Corona Second Wave, Ind-TeluguStop.com

అయితే ఈ ఇటీవలె ఈ కరోనా మహమ్మారిని కొంతమేరకు అరికట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేసి పంపిణీ చేపట్టినప్పటికీ కొన్ని ప్రాంతాలలో అదుపు కావడం లేదు. దీంతో వైద్య నిపుణులు కరోనా మహమ్మారిని అరికట్టే క్రమంలో తన బాదుకుంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కరోనా వైరస్ దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహారాష్ట్రలో రోజు రోజుకి ఉగ్ర రూపం దాల్చుతోంది. దీంతో అక్కడి అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా మాత్రం స్వైర విహారం చేస్తోంది.

దీనికితోడు ఇటీవలే కేరళ, కర్ణాటక, న్యూఢిల్లీ, తదితర రాష్ట్రాలలో రాత్రి పూట కర్ఫ్యూ ని ప్రభుత్వ అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం మా స్కూలు ధరించకుండా విచ్చలవిడిగా రోడ్లపై విహరించడం మరియు ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు పాటించక పోవడం వంటి వాటి కారణంగా రోజు రోజుకి కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నాయి.

దేశంలో మరింత కాలం ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఖచ్చితంగా కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ ను విధించాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక ఇప్పటికే భారతదేశం కరోనా వ్యాక్సిన్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టినప్పటికీ కొన్ని ప్రాంతాలలో వికటించి మృత్యువాత పడుతున్నారని పలు వార్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో కొందరు నిపుణులు ఈ విషయంపై స్పందిస్తూ కరోనా వైరస్ ని అదుపు చేసేందుకు లాక్ డౌన్ మంచి ఆయుధం గా పని చేస్తుందని కాబట్టి మరోమారు కరోనా వైరస్ పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు లాక్ డౌన్ విధిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మరియు లాక్ డౌన్ గురించి తొందర్లోనే దేశ వ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ ఉండబోతుందని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

 కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై స్పందించి ప్రజలకు సరైన స్పష్టత ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube