కరోనా సెకండ్ వేవ్ వస్తోందట… లాక్ డౌన్ తప్పదా…?  

is again lockdown in India for corona Second Wave, corona Second Wave, Corona Virus, lockdown in India news, Lockdown news, India, - Telugu Corona Second Wave, Corona Virus, India, Is Again Lockdown In India For Corona Second Wave, Lockdown In India News, Lockdown News

గత కొద్ది నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తుందో ప్రజలకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు, పారిశ్రామిక రంగాలు నష్టాలను చవి చూశాయి.

TeluguStop.com - Is Again Lockdown In India For Corona Second Wave

 దీంతో గత రెండు, మూడు నెలల నుంచి కొంతమేర కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గడంతో మళ్లీ ఆర్థిక రంగం పుంజుకుంటోంది.కానీ ఈ మధ్య కాలంలో ప్రజలు ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్  నిబంధనలను పాటించకుండా రోడ్లపై తిరుగుతుండడంతో కరోనా వైరస్ మళ్ళీ తన ఉగ్ర రూపాన్ని దాల్చుతోంది.

కాగా ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, తదితర దేశాలలో కరోనా సెకండ్ వేవ్ మొదలైవడంతో  కొందరు నిపుణులు రెండో విడత లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.దీన్ని బట్టి చూస్తే మన దేశంలో కూడా తొందర్లోనే లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TeluguStop.com - కరోనా సెకండ్ వేవ్ వస్తోందట… లాక్ డౌన్ తప్పదా…-General-Telugu-Telugu Tollywood Photo Image

మరోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సంబంధించిన ఎలాంటి పక్కా సమాచారం లేకపోవడంతో ప్రస్తుతం కరోనా వైరస్ ని నివారించడానికి లాక్ డౌన్ ఒకటే మార్గమని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దీంతో మోడీ సర్కార్ కూడా ప్రజల సంక్షేమం కంటే ఏది ముఖ్యం కాదని వచ్చే నెల నుంచి మళ్లీ లాక్ డౌన్ విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొమ్మిది, పది తరగతుల కు సంబంధించిన క్లాసులు మొదలవడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారు.  తాజాగా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

 దీంతో మరింత కాలం పాటు పాఠశాలలో తాత్కాలికంగా మూసివేయాలని సూచిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

#India #Corona Virus #LockdownIn #IsAgain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Again Lockdown In India For Corona Second Wave Related Telugu News,Photos/Pics,Images..