బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4కు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే బిగ్ బాస్ సీజన్ 4 పూర్తై 50 రోజులు గడుస్తున్నా అభిజిత్ సినిమా ఆఫర్లకు సంబంధించి ఎలాంటి వార్తలు వినిపించడం లేదు.
దివి, మోనాల్, అరియానా వరుస ఆఫర్లతో బిజీ అవుతుండగా సోహెల్, అఖిల్ లకు కూడా సినిమా ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది.హారిక, మెహబూబ్ తమ సొంత యూట్యూబ్ ఛానెళ్లలో వీడియోలు చేస్తూ మళ్లీ బిజీ అయిపోయారు.
అయితే అభిజిత్ సినిమాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడటం లేదు.బిగ్ బాస్ తెలుగు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 విన్నర్లకు ఆ షో పెద్దగా కలిసి రాలేదనే సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ 4లో ఊహించని స్థాయిలో ఓట్లతో అభిజిత్ పాపులారిటీని సంపాదించుకున్నాడు.బిగ్ బాస్ హౌస్ నుంచి అభిజిత్ బయటకు వచ్చిన తరువాత అభిజిత్ కు సినిమా ఆఫర్లు వస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పటివరకు అభిజిత్ కు ఎలాంటి ఆఫర్లు వచ్చినట్టు అధికారిక ప్రకటన వెలువడలేదు.దీంతో బిగ్ బాస్ విన్నర్లకు కాలం కలిసిరావడం లేదా.? అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ క్రేజ్ అభిజిత్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది.
అభిజిత్ సినిమాల విషయంలో ఆలస్యం చేస్తే మాత్రం ఉన్న క్రేజ్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.
బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలజీ, బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ లకు ఆ షో ద్వారా పేరు, గుర్తింపు వచ్చినా ఆ గుర్తింపు కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.
బిగ్ బాస్ షో కొంతమందికి కంటెస్టెంట్లకు ప్లస్ అవుతున్నా విన్నర్లకు మాత్రం ఈ షో వల్ల పెద్దగా వచ్చేది ఏం లేదనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.మరి అభిజిత్ మళ్లీ అవకాశాలతో బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.







