బల్లి ఆహారంలో పడితే నిజంగా విషపూరితం అవుతుందా? మనుషులు చచ్చిపోతారా?

బల్లి మనం తినే ఆహారంలో పడితే అది విషపూరితం అయ్యి చంపేస్తుందని పెద్దలు తినవద్దని చెప్పారా? నిజానికి అసలు తినొచ్చా, తినకూడదా అనే విషయానికి ముందు ఈ విషయం తెలుసుకోవాలి.మన చుట్టూ ఉండే జీవుల నుంచి మనం ఎన్నో ప్రయోజనాలను పొందుతుంటాం.

 Is A Lizard Really Poisonous If It Gets Into Food Do People Die ,lizard, Food, P-TeluguStop.com

అయితే, అవి చేసే మేలుని మనం దురదృష్టవశాత్తూ గుర్తించనే గుర్తించం.మనకి మేలు చేసే జీవుల్లో బల్లి ఒకటి.

దాని పేరు చెప్పగానే చాలా మంది ఉలిక్కిపడతారు.అలాగే ఇంకొందరు అయితే అపశకునంగా భావిస్తారు.

అయితే, నిజానికి అవి మానవునికి ఎన్నోరకాలుగా మేలు చేస్తున్నాయి.

బల్లులు ముఖ్యంగా కీటకాలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మనం నివసించే ప్రపంచం నిండా అత్యధికంగా వున్నవి కీటకాలే అని ఎంతమందికి తెలుసు? మన ప్రపంచంలో కీటకాల జనాభా చాలా పెద్దది.కీటకాలు లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం అసలు ఊహించుకోలేం.

అలాగే కీటకాలు మరీ ఎక్కువైనా పరిస్థితులు భయానకంగా మారిపోతాయి.అందుకే ఇక్కడ అసమతౌల్యత అవసరం.

దీన్ని సరిచూడటంలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.దోమలు, ఈగలు లాంటి కీటకాల జనాభా నియంత్రణలో బల్లులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఆ తర్వాత ఈ బల్లులను పక్షులు తింటాయి.అలా ఆహారపు గొలుసు ముందుకు వెళ్తుంటుంది.

Telugu Latest, Lizard, Science, Scientific-Latest News - Telugu

అయితే అనాదిగా బల్లుల చుట్టూ చాలా అపోహలు నిండిపోయాయి.అవి ఎదురైతే మంచిది కాదని, అపశకునమని, ఆహారంలో బల్లి పడితే, అది విషపూరితం అవుతుందని ఇలా చాలా రకాలుగా మాట్లాడుకుంటూవుంటారు.అయితే ఇవన్నీ అపోహలే.బల్లి పడినంత మాత్రాన ఆహారం విషపూరితం కాదు.నిజానికి బల్లుల్లో మనషులను చంపేంత విషం ఉండదు.పరిశోధనలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

అయితే, ఒక్కోసారి బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే వాంతులు, తలనొప్పి లాంటివి కలగొచ్చు.ఇవన్నీ అలర్జీ వల్లే వస్తాయి.

ఈ లక్షణాలను మందులతో మనం తగ్గించుకోవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube