మీ గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడు ఇలా అనొద్దు జాగ్రత్త  

Irritating Topics Men Bring In Front Of Girlfriends-

హ్యూమన్ సైకాలజీ అని ఒకే బ్రాంచ్ ఉన్నా, ఫెమేల్ సైకాలజీ అనే మరో సబ్ బ్రాంచ్ ఉండాలి అనటం అతిశయోక్తి కాదు.ఎందుకంటే, లేడిస్ ఎప్పుడు ఏ విషయానికి హార్ట్ అవుతారో చెప్పలేని పరిస్థితి.ఒక్కోసారి అబ్బాయి మాటల్లో తప్పులు లేకున్నా సరే, హార్ట్ అయిపోతారు.మరి నిజంగానే హార్ట్ అయ్యే విషయాలు మాట్లాడితే కోపం రాకుండా ఉంటుందా.బాయ్ ఫ్రెండ్స్ తెచ్చే ఆ సిల్లి టాపిక్స్ ఏంటో చూద్దాం.* కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ తమ గర్ల్ ఫ్రెండ్స్ ఏ అబ్బాయితోనూ క్లోజ్ గా ఉండకూడదు అని అనుకుంటారు.

Irritating Topics Men Bring In Front Of Girlfriends---

తనకి మంచి స్నేహితుడైనా సరే, అబ్బాయి కాబట్టి మాట్లాడకూడదు.ఈ మెంటాలిటి ఉన్న అబ్బాయిలతో ఎక్కువకాలం రిలేషన్ షిప్ లో ఉండలేరు అమ్మాయిలు.* నాకు ఈ అమ్మాయి పరిచయం, ఆ అమ్మాయి క్లోజ్, ఆ అమ్మాయి వెంటపడుతోంది అంటూ మీ ఫెమేల్ ఫాలోయింగ్ ని ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గర చూపించవద్దు.

అది బిల్డప్ లా అనిపించినా, బ్రేక్ అప్ కి దారి తీస్తుంది.* గర్ల్ ఫ్రెండ్ ఫిగర్ మీద ఎప్పుడు కామెంట్ చేయవద్దు.లావెక్కుతున్నావు అనే మాట అంటే అమ్మాయిలకు అసహ్యం.మీరు ప్రేమించేది తనని కాని, తన శరీరాన్ని కాదు అనే భావన తనకి కలగాలి.* ప్రతీ చిన్న విషయానికి “ఈ అమ్మాయిలంతా ఇంతే” అనే జేనరలైజైషన్ వద్దు.బయటకి చెప్పినా చెప్పకున్నా, ఇట్ హర్ట్స్.* మొబైల్ పాస్ వర్డ్ అడగటం, రాత్రి అంతసేపు ఆన్ లైన్ లో ఎందుకు ఉన్నావు అని అనడం ఎంత క్యాజువల్ గా అనిపించినా, చాలా అవమానకరంగా ఉంటుంది అమ్మాయిలకు.

అందుకే ప్రతి మాట నోటి నుంచి బయటకి వచ్చేముందు కొంచెం ఆలోచించండి.