ఒక హీరోని ఇంతగా అభిమానిస్తారా....

మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినా చివరికి కాటికి వెళ్లే సమయంలో ఏది తీసుకుపోలే డని కేవలం తాను చేసినటువంటి మంచి పనులు మాత్రమే తన వెంట వస్తాయని, అంతేగాక మరో నలుగురు కూడా తన గురించి గర్వంగా చెప్పుకుంటుంటారని పెద్దలు చెబుతుంటారు.మామూలుగా హీరోలకి అభిమానులు ఉంటారని తెలుసు.

 Irrfan Khan, Bollywood Star Hero, Bollywood, Egathpuri, Irfan Khan Death News-TeluguStop.com

దీంతో కొంత మంది హీరో కోసం పాలాభిషేకం చేయడం, తన సినిమాలు విడుదలయ్యే సమయంలో పెద్ద పెద్ద పూలమాలలు కట్టి హంగామా చేయడం చూస్తుంటాం.కానీ బాలీవుడ్ సినీ పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దివంగత స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ పేరుని కొంతమంది ఏకంగా ఊరిలోని వీధికి తన పేరు పెట్టుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ఈగత్ పూరి అనే గ్రామాన్ని గతంలో ఇర్ఫాన్ ఖాన్ దత్తత తీసుకొని తనకు తోచినంత సహాయం చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. అంతేకాక ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి ఆరోగ్య సేవలు మరియు విద్య సంబంధిత సేవలను సమకూర్చడంలో ఎంతగానో సహాయం చేశాడు.

దాంతో ఆ గ్రామ ప్రజలు ఇప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.అందువల్ల ఎలాగైనా తమ గ్రామానికి ఇంత సేవ చేసినటువంటి ఇర్ఫాన్ ఖాన్ రుణాన్ని  తీర్చుకోవాలని తమ గ్రామంలోని ఓ వీధికి కి హీరో ఛీ వాడి అనే పేరు పెట్టారు.

ఈ విషయంపై కొందరు గ్రామ పెద్దలు స్పందిస్తూ గతంలో తమ గ్రామానికి ఎంతో సహాయం చేశారని ఇలా ఉన్నట్లుండి ఇర్ఫాన్ ఖాన్ మరణించడం తమని తీవ్రంగా కలచి వేసిందని వాపోతున్నారు.

అయితే ఇర్ఫాన్ ఖాన్ నటించిన టువంటి ది లైఫ్ ఆఫ్ పై అనే చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకుంది.

అలాగే స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం కూడా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ చిత్రంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube