మీడియా పిచ్చికి అంతెక్కడ ??

మీడియా.సమాజంలో పూర్తి భాద్యత కలిగిన వాటిల్లో మీడియా మొదటి స్థానంలో ఉంటుంది.అలాంటి మీడియా ఇప్పుడున్న పరిస్థితుల్లో…కొట్టుకుపోతూ.అప్పడుప్పుడు కనీస మానవత్వ స్పందన కూడా మరచిపోతుందేమో అనిపిస్తుంటుంది.దీనికి నిదర్శనం నిన్న జరిగిన ఒక సంఘటన…సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడుతున్న ఓ మహిళకు బెంగళూరు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను అమర్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆ గుండె బెంగళూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే అంతవరకూ ప్రతీ సెకను ఎంతో విలువైనదే.అయితే అలాంటి విలువైన సమయాన్ని కూడా మీడియా ప్రతినిధులు అపహాస్యం చేశారు.

 Irresponsible Media ??-TeluguStop.com

ఈ గుండెను తరలించే పనిలో ఆ గుండె ప్రయాణం కోసం బేగంపేటలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.ట్రాఫిక్ ను ఆ రూట్లో నిలిపేశారు.

ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో కూడా మీడియా వారు తమ స్థాయి మరచి ఏకంగా అంబులెన్సు సిబ్బంది నోటి దగ్గర మైకులు పెట్టి వారి స్పంధన కోరారు.ప్రతి సెకనూ విలువైన ఆ సమయంలో.

ఆ అంబులెన్స్ నిర్వాహకుడి మాటలు రికార్డు చేయడం అవసరమా.ఆ విషయంలో ఆయన స్పందించేదేముందుటుంది.

ఆపరేషన్ ముఖ్యమా.స్పందన రికార్డు చేయడం ముఖ్యమా.

అన్న కామన్ నెన్స్ మరవడం దారుణం.అంబులెన్స్ సిబ్బంది కూడా కొందరు గుండె సంగతి పక్కకుపెట్టి.

మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కొసమెరుపు.మరి ఇలాంటి పరిస్థితుల్లో మీడియాకు భాద్యత లేదంటారా.

ఇదేనా వారు సమాజం కోసం ఆలోచించేది.ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆ మహిళకు ఏమైనా అయ్యి ఉంటే దానికి మీడియా భాద్యత తీసుకుంటుందా?? ఏమైనా భాద్యతతో ప్రవర్తించాల్సిన మీడియా ఇలా చేయడం సిగ్గు పడాల్సిన విషయమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube