నీ క్రియేటివిటీకి దండం పెట్టాలిరా సామీ అంటున్న నెటిజన్స్..!!

కరోనా కాలంలో అందరూ ఇంటికే పరిమితం అవ్వడంతో కొత్త ప్రయోగాలను ఆవిష్కరిస్తున్నారు.వాటిలో కొన్నిటిని చూసి వావ్ అని అనాలనిపిస్తుంది.

 Iron With Gas Cylinder New Creative, Viral Latest, News Viral, Social Media, Viral Video, Netizens, Iron Box-TeluguStop.com

మరికొన్నిటిని చూసి ఓరి! నీ చావు తెలివితేటలు తగలెయ్యా అని అనాలనిపిస్తుంది.మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రకరకాల ఫుడ్ కాంబినేషన్ ఐడియాలతో నెటిజన్స్‌కి పిచ్చి ఎక్కిస్తున్నారు.

వాళ్ల క్రియేటివిటీ ఏమో గాని చూసిన మనకు మాత్రం విసుగు రావడం గ్యారంటీ అనేలా ఉన్నాయి.అయితే కొందరు మాత్రం తమ తెలివితేటలకు పదును పెట్టి గొప్ప ఇన్వెన్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 Iron With Gas Cylinder New Creative, Viral Latest, News Viral, Social Media, Viral Video, Netizens, Iron Box-నీ క్రియేటివిటీకి దండం పెట్టాలిరా సామీ అంటున్న నెటిజన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారు చేసే ప్రయోగాలు చూసి గొప్ప గొప్ప ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడుతున్నారు.ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

మరి ఆ వీడియో ఏంటో ఒక లుక్ వేద్దామా.సాధారణంగా మనం బట్టలను ఐరన్ బాక్స్‌తో లేదంటే బొగ్గులు వేసి చేసే ఇస్త్రీ పెట్టెతో బట్టలను ఇస్త్రీ చేయిస్తాం.

ఇస్త్రీ చేసేవాళ్లు కూడా పైన చెప్పిన రెండు పద్ధతులతోనే బట్టలను ఐరన్ చేస్తూ ఉంటారు.కానీ మీరు వంట చేసే గ్యాస్ సిలిండర్‌తో ఇస్త్రీ చేయడం చూసారా… లేదంటే దాని గురించి విన్నారా? లేదు కదా.కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఏకంగా గ్యాస్ సిలిండర్ సహాయంతో బట్టలు ఇస్త్రీ చేయడం వీడియోలో మనం చూడవచ్చు.

అసలు ఈ ఐడియా నీకెలా వచ్చిందని అతనిని అడగగా…ఏమో తనకు తెలియదని.గత నాలుగేళ్లుగా ఇలాగే గ్యాస్ సిలిండర్‌తో బట్టలు ఇస్త్రీ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియోను ఎంతోమంది నెటిజన్స్ చూడడంతో పాటు లైక్స్, షేర్స్, కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.

నీ ఐడియాకు సలామ్ కొట్టాలి భయ్యా అని కొందరు నెటిజన్స్ అంటే మేము కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తే పోలా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube