ఏలియన్ అనుకొని బెదిరిపోయిన జనాలు.. కానీ..?

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఏలియన్స్(గ్రహాంతర వాసులు) గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు.కొందరు శాస్త్రవేత్తలు ఏలియన్స్ నిజంగానే ఉన్నాయని చెబుతుంటే మరికొందరు మాత్రం ఏలియన్స్ లేవని చెబుతూ ఉంటారు.

 Iron Man Balloon Creates Panic In Higher Noida  Aliyan, Iron Man Doll, Noida, So-TeluguStop.com

ప్రజల్లో సైతం ఏలియన్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.అయితే తాజాగా నోయిడాలో ప్రజలను ఏలియన్ భయపెట్టింది.

ఆకాశంలో వింత ఆకారంలో ఉన్న ఏలియన్ కనిపించడంతో ప్రజలు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు.

అయితే జనాలను భయాందోళనకు గురి చేసిన వింత ఆకారం ఏలియన్ కాదని బెలూన్ అని తెలిసి స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా డాంకౌర్ ప్రాంతంలో వింత ఆకారం ఉన్న ఒక వస్తువు గాలిలో ఎగిరిగింది.ఆ ఆకారాన్ని చూసిన ప్రజలకు అక్కడ ఏం ఎగురుతుందనే విషయం అర్థం కాలేదు.

దీంతో కొందరు స్థానికులు ఆకాశాంలో ఏలియన్ ఎగురుతోందని ప్రచారం చేశారు.

క్షణాల వ్యవధిలోనే ఈ వార్త తెలిసి డాంకౌర్ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆకాశంలో వింత ఆకారంలో ఎగురుతున్న బెలూన్ ను పట్టుకుని ప్రజలకు ధైర్యం చెప్పారు.అయితే ప్రజలను టెన్షన్ పెట్టిన ఆ వింత బెలూన్ ను ఎవరు ఎగురవేశారనే సంగతి తెలియాల్సి ఉంది.

డాంకౌర్ తో పాటు ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న భట్టా పార్సాల్ ప్రాంతంలోను ఎగిరిన బెలూన్ ఆ తర్వాత కాలువలో కింద పడింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వింత బెలూన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పోలీసులు బెలూన్ ను ఎగురవేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.ప్రజలను భయాందోళనకు గురి చేసే ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు సోషల్ మీడియా వేదికగా సూచనలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube