పాపం.. అతనికి ఐరన్ లెగ్ పేరు దెబ్బ కొట్టిందట!

సినిమాల్లో నటించే చాలామంది నటీనటులు ఒరిజినల్ పేర్లతో పోలిస్తే క్యారెక్టర్లతో పాపులర్ అవుతూ ఉంటారు.అలా ప్రేక్షకులకు క్యారెక్టర్ పేరుతో గుర్తుండిపోయిన వాళ్లలో ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరు.

 Iron Leg Sastri Family Facing Financial Troubles, Iron Leg Sastry, Appula Appara-TeluguStop.com

ఐరెన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథశాస్త్రి.లావుగా కనిపించే ఐరెన్ లెగ్ శాస్త్రి తనదైన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించారు.

దాదాపు 150కు పైగా సినిమాల్లో నటించిన ఐరన్ లెగ్ శాస్త్రి చివరి దశలో తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు.

ఈవీవీ దర్శకత్వంలో తెరకెక్కిన అప్పుల అప్పారావు చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఐరన్ లెగ్ శాస్త్రి చాలా సినిమాల్లో పురోహితుని పాత్రలో నటించారు.

బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి కాంబినేషన్ అంటే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ టాలీవుడ్ సినీ వర్గాల్లో ఉండేది.మొదట్లో సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసిన శాస్త్రికి అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం లభించింది.

సినిమాల్లో ఐరన్ లెగ్ పాత్రల్లో నటించినా ఆయనది గోల్డెన్ లెగ్గే.ఏ సినిమాలో నటించినా శాస్త్రికి మంచి గుర్తింపు రావడంతో పాటు సినిమా సూపర్ హిట్ అయ్యేది.

అయితే కెరీర్ మొదట్లో ఏ ఐరన్ లెగ్ పాత్రల వల్ల ఆయనకు గుర్తింపు వచ్చిందో అదే ఆయనకు అవకాశాలను కూడా దూరం చేసింది.కెరీర్ లో శాస్త్రి ఒక వెలుగు వెలిగాక ఐరన్ లెగ్ శాస్త్రి నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

దీంతో అతను నటిస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని నమ్మి కొందరు అవకాశాలు ఇవ్వడం మానేశారు.సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి పాత్రల్లో ఎక్కువగా నటించడం వల్ల పౌరోహిత్యం చేయడానికి కూడా ఐరన్ లెగ్ శాస్త్రిని ఎవరూ పిలిచేవాళ్లు కాదు.

ఒక ఇంటర్వూలో ఐరన్ లెగ్ శాస్త్రి మాట్లాడుతూ స్క్రీన్ నేమ్ తన వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube