అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా, అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.2013లో క్రికెట్ లో తన కెరీర్ ని ప్రారంభించిన ఇర్ఫాన్ పఠాన్ 120 వన్డేలు ఆడి 173 తీసాడు.అలాగే 29 టెస్ట్ మ్యాచ్ లు ఆడి వంద వికెట్లు తీసాడు.

 Irfan Pathan Retires From International Cricket-TeluguStop.com

ఇక ఆల్ రౌండర్ గా కూడా టీమ్ ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషించాడు కెరియర్ ఆరంభంలో టీమ్ ఇండియా పేస్ దళాన్ని నడిపించి భారత్ కి అద్బుత విజయాలు అందించిన ఘనత ఇర్ఫాన్ పఠాన్ సొంతం.తన స్వింగ్ మాయాజాలంలో ఓపెనింగ్ ఓవర్స్ లో కీలక వికెట్లు పడగొట్టడంలో ఇర్ఫాన్ పఠాన్ అద్బుతమైన నైపుణ్యం ప్రదర్శించాడు.

ఓ విధంగా అద్బుతంగా అంతర్జాతీయ కెరియర్ ని బౌలర్ గా కొనసాగించిన ఇర్ఫాన్ పఠాన్ అనూహ్యంగా అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ కారణంగా బ్యాట్స్ మెన్ అవతారం ఎత్తి మంచి ఇన్నింగ్స్ ఆడాడు.ఆ క్రమంలో బౌలింగ్ గాడి తప్పడంతో టీమ్ ఇండియాలో చోటు కోల్పోయాడు.

చివరిగా 2012లో భారత్ తరుపున పఠాన్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.ఆ తరువాత దేశవాళీలో ఆడుతూ తిరిగి టీమ్ ఇండియాలో చోటు సంపాదించాలని ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు.

పేస్ దళంలోకి కొత్త రక్తం రావడంతో పాటు, అద్బుతమైన సామర్ధ్యం ఉన్న వారు రావడంతో సెలక్షన్ కమిటీ ఇర్ఫాన్ పఠాన్ ని పరిగణంలోకి తీసుకోలేదు.దీంతో గత ఏడాది నుంచి దేశవాళీ క్రికెట్ కి కూడా దూరంగా ఉన్నాడు.

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెబుతూ ప్రకటన చేశాడు.తనకి అనుకున్న స్థాయిలో టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube