ప్రేక్షకులకి తన యాక్టింగ్ నచ్చితే కొనసాగుతా అంటున్న ఇర్ఫాన్

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆల్ రౌండర్ గా దశాబ్దకాలం పాటు రాణించిన ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్.కెరియర్ ఆరంభంలో తన బౌలింగ్ టాలెంట్ తో ప్రత్యర్ధి ఆటగాళ్ళకి చెమటలు పట్టించిన ఇర్ఫాన్ తరువాత బ్యాట్స్ మెన్ కూడా మంచి ప్రతిభ చూపించాడు.

 Irfan Pathan Plan To Acting Career, Tollywood, Kollywood, Cobra Movie, Chiyaan V-TeluguStop.com

అయితే రెండింటిని బ్యాలెన్స్ చేయలేక కొంతకాలం ఫామ్ కోల్పోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులు ఆతని కొనసాగించాడు అయితే యువ ఆటగాళ్ళ జోరు పెరుగుతూ ఉండటంతో ఇర్ఫాన్ కి అవకాశాలు తగ్గిపోయాయి.దాంతో ఐపీఎల్, దేశవాళీ మ్యాచ్ లని కొంతకాలం కొనసాగించారు.

అయితే ఇక కెరియర్ చాలు అనుకుని రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నటుడుగా కొత్త అవతారం ఎత్తారు.కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన కోబ్రా సినిమాలో మెయిన్ విలన్ గా ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అందులో ఇర్ఫాన్ పఠాన్ మంచి పెర్ఫార్మెన్స్ చూపించాడు.కొన్ని సెకండ్స్ కనిపించిన కోబ్రాలో అతను ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయం మాత్రం ప్రేక్షకులకి అర్ధమైంది.ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో ముచ్చటించే క్రమంలో తన సినిమా ప్రయాణం గురించి ఇర్ఫాన్ మరింత క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం తెలుగు, తమిళంలో అవకాశాలు వస్తున్నాయని, అయితే కోబ్రా సినిమా రిలీజ్ తర్వాత తన పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడితే అప్పుడు యాక్టింగ్ గురించి సీరియస్ గా ఆలోచిస్తానని చెప్పారు.అలాగే తన క్రికెట్ కమిట్మెంట్ లు లేకుంటే సినిమాలు చేసుకుంటూ వెళ్తానని చెప్పుకొచ్చారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube