భారీ సిక్సర్ కొట్టి తన కారు అద్దాలను తానే పగలకొట్టుకున్న క్రికెటర్...!

క్రికెట్ స్టేడియంలో బ్యాట్స్ మెన్ సిక్సర్లు కొడుతుంటే అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషం వస్తుంది.సిక్సులు కొట్టిన ప్రతిసారి అభిమానులు నిలబడి అరుస్తూ చీరప్ చేస్తుంటారు.

 Ireland’s Kevin O’brien Smashes Own Car Window With Monster Six, Ireland’s-TeluguStop.com

చూసే అభిమానుల్లోనే అంత సంతోషం ఉంటే ఆ సిక్సర్ కొట్టిన బ్యాట్స్ మెన్ ఇంకెంత సంతోషం ఉంటుంది.సిక్స్ కొడితే చాలు ఎగిరి గంతేస్తారు.

ఐర్లాండ్ కు చెందిన ఓ స్టార్ క్రికెటర్ కూడా భారీ సిక్స్ కొట్టాడు.ఆ దెబ్బకు బాల్ స్టేడియం దాటి వెళ్లిపోయింది.

బాల్ స్టేడియం దాటాలంటే మాములు విషయమా…? అభిమానులకు పండగే పండుగ.మొదట్లో ఆ బ్యాట్స్ మెన్ సంతోషపడినా చివరకు బాధపడాల్సి వచ్చింది.
ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ ఓబ్రేయిన్ మ్యాచ్ లో భారీ సిక్స్ ను కొట్టాడు.అప్పుడు అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.కానీ, అతడు కొట్టిన బాల్ నేరుగా అతడి కారు అద్దాలపై పడటంతో కారు అద్దాలు పగిలిపోయాయి.విషయం తెలిసి ముందు బాధ పడ్డా ఆ తర్వాత నవ్వుకున్నాడు.

ఇటీవల ఐర్లాండ్ దేశంలో ఇంటర్ ప్రవిన్షియల్ టీ-20 మ్యాచ్ లు జరుగుతున్నాయి.ఈ మ్యాచ్ లో కెవిన్ లీన్ స్టర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ మ్యాచ్ లో కెవిన్ తన విశ్వరూపం చూపించాడు.సిక్సర్ల వర్షం కురిపించాడు.

ప్రత్యర్థులకు చెమట పట్టించాడు.భారీ సిక్సర్లు కొడుతూ ఈ మ్యాచ్ ను విన్ అయ్యారు.

ఆ మ్యాచ్ లో కొట్టిన ఓ సిక్సర్ ఏకంగా స్టేడియమే దాటేసింది.

Telugu Car Window, Irelandskevin, Stadium-Telugu NRI

బంతి స్టేడియం మీదుగా వెళ్లి అతని కారు మీద పడింది.మ్యాచ్ ముగిసిన తర్వాత కారు అద్దాలు పగిలిపోయాయని కెవిన్ కు సమాచారం అందింది.కారు అద్దాలు పగిలాయని వార్త విన్నప్పడు తొలత బాధ పడినా, ఆ తర్వాత నవ్వుకుని షోరూంకి వెళ్లి రిపేర్ చేయించుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలను క్రికెట్ ఐర్లాండ్ ఖాతాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube