వైరల్‌ : చనిపోయిన వ్యక్తి స్మశానంలో అందరిని నవ్వించాడు  

Ireland Army Man Makes Funeral Burst Out With Laughter-audio Tape Record,friends And Relations Comes His Funeral,his Recorded His Last Voice,irland Kilma Nag,shai Bradly Person

ఎవరైనా చనిపోయినప్పుడు బాధ తన్నుకుని బయటకు వచ్చి దు:ఖం మాదిరిగా కనిపిస్తుంది.చనిపోయిన వ్యక్తితో ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేసుకుంటూ జనాలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు.

Ireland Army Man Makes Funeral Burst Out With Laughter-audio Tape Record,friends And Relations Comes His Funeral,his Recorded His Last Voice,irland Kilma Nag,shai Bradly Person-Ireland Army Man Makes Funeral Burst Out With Laughter-Audio Tape Record Friends And Relations Comes His His Recorded Last Voice Irland Kilma Nag Shai Bradly Person

Ireland Army Man Makes Funeral Burst Out With Laughter-audio Tape Record,friends And Relations Comes His Funeral,his Recorded His Last Voice,irland Kilma Nag,shai Bradly Person-Ireland Army Man Makes Funeral Burst Out With Laughter-Audio Tape Record Friends And Relations Comes His His Recorded Last Voice Irland Kilma Nag Shai Bradly Person

అయితే ఒక వ్యక్తి తాను చనిపోయిన సమయంలో అంతా నవ్వాలని భావించాడు.నేను చనిపోయానంటూ బాధ పడ్డ వారు, కన్నీరు పెట్టుకున్న వారిని నవ్వించాలనే ఉద్దేశ్యంతో ఎవరు చేయని వింత పని చేశాడు.

ఆయన బతికి ఉన్నప్పుడు చేసిన పనితో చనిపోయిన తర్వాత జనాలను నవ్వించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఐర్లాండ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.కిల్మనాగ్‌కు చెందిన శాయ్‌ బ్రాడ్లీ అనే మాజీ సైనికుడు ఇటీవల మృతి చెందాడు.ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంలో మునిగి పోయారు.కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మరియు బంధువులు కూడా బ్రాడ్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.

చివరకు శాయ్‌ బ్రాడ్లీని స్మశానానికి తీసుకు వెళ్లారు.అక్కడ బాక్స్‌లో పెట్టి పూడ్చి పెట్టేందుకు అంతా సిద్దం చేశారు.

బాక్స్‌ను పూడ్చే ముందు ఒక స్పీకర్‌ పెట్టి తాను రికార్డ్‌ చేసిన ఒక వాయిస్‌ను వినిపించాలని బ్రాడ్లీ చనిపోక ముందే కోరాడు.ఆయన కుటుంబ సభ్యులు అందుకోసం ఏర్పాటు చేశారు.స్పీకర్‌ పెట్టారు.ఆ సౌండ్‌ ఏమై ఉంటుందా అంటూ అంతా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు.అలాంటి సమయంలో ఆ సౌండ్‌ ఆన్‌ చేయగానే టక్‌ టక్‌ అంటూ శవ పేటికను లోపల నుండి కొడుతున్నట్లుగా శబ్దం వచ్చింది.అంతా ఆశ్చర్య పోయి చూశారు.

నేను ఎక్కడ ఉన్నాను.నన్ను బయటకు తీయండి, ఇక్కడ చాలా చీకటిగా ఉంది.నేను శాయ్‌ను మాట్లాడుతున్నాను.నన్ను శవ పేటికలో పెట్టారు.నేను చనిపోయాను అంటూ మాట్లాడాడు.ఆ మాటలకు అక్కడ ఉన్న వారు అంతా కూడా కన్నీరు పెట్టుకుంటూ నవ్వేశారు.

శాయ్‌ బతికి ఉన్న సమయంలో కూడా అందరిని నవ్విస్తూ సరదాగా ఉండేవాడట.అందుకే చనిపోయిన తర్వాత కూడా అంతా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశ్యంతో అతడు ఇలా చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.