మీరు రైలులో ప్రయాణం సాగించినప్పుడు రైల్వే నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.లేని పక్షంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా చైన్ లాగడం లేదా టిక్కెట్ లేకుండా ప్రయాణించడం చూసుంటారు.అయితే ఇవి రెండే రైలులో చేయకూడని పనులనుకుంటే పొరపడినట్లే.
రైలుపైన లేదా డోర్ దగ్గర ప్రయాణించడం అనేది రైల్వే చట్టంలోని సెక్షన్ 156 ప్రకారం నేరం.అలా ఎవరైనా ప్రవర్తిస్తే సదరు ప్రయాణీకుడికి రూ.500 జరిమానాతోపాటు, 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు.రైలులో ప్రయాణించేటప్పుడు చాలా మంది రైలులోనే చెత్తను పడేస్తుండటం మీరు గమనించే ఉంటారు.
ఇలా చేయడం చాలా తప్పు.రైల్వే చట్టంలోని సెక్షన్ 145 (B) ప్రకారం మొదటిసారి అలా చేస్తే రూ.100 జరిమానా మరియు రెండోసారి కూడా చేస్ రూ.
250 జరిమానా లేదా ఒక నెల జైలు శిక్ష విధిస్తారు.ఇది కాకుండా రైలులో అసాంఘిక పనుల చేస్తే ఈ చట్టం ఆధారంగా శిక్ష విధిస్తారు.రైలులో పోస్టర్లు అతికించడం చట్టరీత్యా నేరం.రైల్వే చట్టంలోని సెక్షన్ 166 (బి) ప్రకారం, ఇటువంటి ప్రయాణికుడికి 6 నెలల జైలు శిక్ష రూ.500 వరకూ జరిమానా విధిస్తారు.మోసపూరితంగా.అంటే టిక్కెట్ లేకుండా ప్రయాణించేటప్పుడు పట్టుబడితే.రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం ఆ ప్రయాణీకుడికి 1000 రూపాయల జరిమానా విధించే అవకాశాలున్నాయి.అలాగే 6 నెలల జైలు లేదా రెండూ విధించవచ్చు.దీనితోపాటు పొరపాటున రిజర్వ్‌డ్ కోచ్‌లో ప్రయాణిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 155 (A) ప్రకారం 3 నెలల వరకు జైలు, రూ.500 జరిమానా విధిస్తారు.