దేవుడా: ఆ రైలు ఆలస్యం అవ్వడంతో ఫైన్ వేసిన ప్యాసింజర్స్.. దాంతో..?!

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తేజస్ రైలును కేంద్రం ప్రవేశపెట్టింది.అయితే ఈ రైలు లేట్ గా రావడంతో ప్యాసింజర్స్ ఫైర్ అయ్యారు.

 Irctc Paid Four Lakhs To Passengers Due To The Delay Of Tejas Train, Tejas Train-TeluguStop.com

తమ నుంచి తీసుకున్న ఫీజును చెల్లించాలని గోల చేశారు.దీంతో చేసేదేమీ లేక తేజస్ రైలు నిర్వాహకులు ఒక్కో ప్రయాణికుడికి రూ.250 చెల్లించింది.తేజస్ రైలు పట్టాలెక్కి 2 సంవత్సరాలు అవుతోంది.

అయితే ఇప్పటి వరకూ కూడా అది ఆలస్యంగా వెళ్లలేదు.దేశంలో నడిచే ప్రైవేట్ రైలు ఇది.సాధారణంగా రైళ్లు ఆలస్యంగా వస్తుంటాయి.అయితే తేజస్ రైలు మాత్రం అలా కాదని నిరూపించింది.

అయితే ఇన్ని ఏళ్ల తర్వాత తేజస్ రైలు ఆలస్యమైంది.దీంతో ట్రైన్ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తేజస్ రైలు లేటుగా రావడంతో ఐఆర్సీటీసీ ఫైర్ అయ్యింది.ఈనెలలో 21వ తేదీన లక్నో నుంచి తేజస్ రైలు బయల్దేరింది.

అయితే అది రెండున్నర గంటలు ఢిల్లీకి ఆలస్యంగా వచ్చింది.

సిగ్నల్ ఫెయిల్ కావడం వల్లే లేటుగా రావాల్సి వచ్చిందని తేజస్ రైలు నిర్వాహకులు చెప్పారు.

అయినప్పటికీ ప్రయాణికులు ఆగ్రహం చెందారు.లేటుగా ట్రైన్ ను నడిపినందుకు గాను తమ టికెట్ డబ్బుల్లోంచి కొంత తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.దీంతో రైల్లో ప్రయాణించిన 1574 మంది ప్యాసింజర్లకు ఒక్కోక్కరికి 250 రూపాయలను అంటే మొత్తంగా చూస్తే రూ.3,93,500 ను ఐఆర్‌సీటీసీ ఇచ్చేసింది.

Telugu Lakhs, Ahmedabad, Delayed, Irctc, Lucknow, Mumbai, Paid, Passengers, Siga

తేజస్ రైలు 2016వ సంవత్సరంలో మొదలైంది.కరోనా కారణంగా 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు 7వ తేది వరకూ ఆ రైలు నడవలేదు.తేజస్ రైలు లక్నో, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై మధ్యలో ప్రయాణం చేస్తుంది.ఇది ప్రైవేట్ ట్రైన్ కావడం వల్ల దీని పర్యవేక్షణ ఎప్పకప్పుడు జరుగుతూ ఉంటుంది.ఈ ట్రైన్ లో ఎలాంటి సాంకేతిక సమస్య ఉండదని గతంలో ఈశాన్య రైల్వే చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు.ఇప్పుడు ఇది ఆలస్యం కావడం వల్ల దీనిపై మరింత నిఘా పెట్టి నడపనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube