మహిళల కోసం క్యాష్ బ్యాక్ ప్రకటించిన ఐఆర్సిటిసి..!

ట్రైన్స్ లో ప్రయాణించే మహిళలకు శుభవార్త.ఆగస్టు 22న రాఖీ పండగ సందర్భంగా రైల్వే శాఖ మహిళ కోసం ఒక మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్ ని మన ముందుకు తీసుకుని వచ్చింది.

 Irctc ,cash Back Offer, ,women, Raksha Bandan Special, Viral News, August 22nd,-TeluguStop.com

లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్ – ముంబై మధ్య గల తేజస్ ఎక్స్‌ప్రెస్‌ లో ప్రయాణించే మహిళలకు మాత్రమే ఈ ఆఫర్.వేరే ట్రైన్స్ లో ప్రయాణిస్తే ఈ ఆఫర్ వర్తించదు.

అంతేకాకుండా ముందు వచ్చే పండుగల సందర్బంగా కూడా ప్రీమియం రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మరిన్ని మంచి ఆఫర్‌ లను తీసుకుని రావాలనే ఆలోచనలో ఐఆర్‌సీటీసీ ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు రాఖి పండగ ఆఫర్ వివరాల్లోకి వెళితే.

మహిళలు ఎవరయితే తేజస్ రైళ్లలో టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లభిస్తుంది.మనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి వారికి చేరనుంది.

ఈ ఆఫర్ ఆగస్టు 15 నుండి ఆగష్టు 24 వరకు రెండు తేజస్ రైళ్లలో ప్రయాణం చేసే మహిళలకు మాత్రమే లభిస్తుంది.వీరికి 5 శాతం ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది.

ఐఆర్‌సీటీసీ ఆ ఆఫర్ అనేది పరిమిత కాలపు ఆఫర్ మాత్రామే.ఈ ఆఫర్ సమయంలో మహిళలు ఎన్నిసార్లు అయినా రైలులో ప్రయాణం చేయవచ్చు.

ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ టిక్కెట్లు బుక్ చేసుకున్న తరువాత వారి అకౌంట్ లోకి వస్తాయి.

Telugu August, Cash, Irctc, Raksha Bandan-Latest News - Telugu

తేజస్ ఎక్స్‌ప్రెస్.లక్నో-ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై-అహ్మదాబాద్ రూట్ లో ప్రతి శుక్ర, శని, ఆది, సోమవారాలలో రెండు తేజస్ రైళ్లు ప్రయాణం చేస్తాయి.ఈ సందర్భంగా ఐఆర్‌సిటిసి చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.

తేజస్ ఎక్స్‌ప్రెస్‌ లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతుందని తెలిపారు.అందుకే మహిళల కోసం ఈ క్యాష్‌ బ్యాక్ ఆఫర్ ను ప్రవేశ పెట్టామని తేలిపారు.

కాబట్టి మహిళలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube