సంచలనం సృష్టించిన బార్బర్‌ జైనబ్‌..!

ఇరాక్ దేశంలో మహిళలకు ఫ్రీడం తక్కువే అని చెప్పుకోవచ్చు.ఇంటి పనులకే తప్ప సమాజంలో పురుషులకు ధీటుగా పని చేయడానికి అక్కడి మతస్థులు ఒప్పుకోరు.

 First Woman Working At The Barbers Of Babylon Shrugs Off Abuse, First Barber Wom-TeluguStop.com

కానీ దక్షణాది ఇరాక్ లో పురుషులకు ధీటుగా పని చేసేందుకు, ఏకంగా పురుషుల బార్బర్ షాపునే ఏర్పాటు చేసి వార్తల్లోకి ఎక్కింది జైనబ్.తొలి బార్బర్ మహిళగా సంచలనం సృష్టించింది.

ఇక్కడి మహిళలకు కొత్త ఉపాధి అవకాశాల్లోకి రావాలని ఉన్నా సంప్రదాయాలు అడ్డుపడుతాయి.

ఇరాక్ లో మతానికి వ్యాల్యూ ఎక్కువ.

మహిళ గడప దాటడానికే అభ్యంతరాలు చెబుతుంటారు కొందరు.బయటకు వచ్చినా బుర్కాలు తప్ప వేరే దుస్తులు ధరించరాదు.

అలాంటి నిబంధనలు అమలయ్యే దేశంలో జైనబ్ కొత్త నాంధీకి అడుగులు వేసింది.పురుషులకే పరిమితమయ్యే ఉపాధి పనుల్లో మహిళలు ప్రవేశించినప్పుడు వారికి వ్యతిరేకత రావడం సహజం.

ఇరాక్ వంటి దేశాల్లో ఓ సవాల్ గా భావించవొచ్చు.కానీ జైనబ్ ఆ సవాళ్లను ఎదురించి ముందు నిలబడింది.

ఇరాక్ లోని బాబిలోన్ ప్రాంతంలోని హిల్లా పట్టణంలో జైనబ్ బార్బర్ షాపును నెలకొల్పి అక్కడి మహిళలకు ఆదర్శంగా నిలిచింది.హిజాబ్ ను ధరించి పట్టణంలోని బార్బర్ షాపులో పురుషులకు హెయిర్ కట్ చేస్తుంది.

హెయిర్ కట్ తో పాటు పచ్చబొట్లు కూడా పొడుస్తోంది.అక్కడి మతస్థుల నుంచి వ్యతిరేకత వచ్చినా ధైర్యంగా నిలబడి ముందుకు నడుస్తోంది.

ఇరాక్ నవ నిర్మాణం కోసం స్త్రీలు ముందుకు రావాలని పిలుపునిస్తోంది.

జైనబ్ మాట్లాడుతూ.

‘‘ నాకు ఇద్దరు పిల్లలు.భర్త, షాపు యజమాని సాయంతో బార్బర్ షాపును ఏర్పాటు చేశాను.

నేను షాపుకు నడుచుకుంటూ వచ్చేంత వరకు నా వెనకాల వంద మంది వంద రకాలుగా మాట్లాడుతారు.అందంతా వట్టి మాటలకే పరిమితం.

నా ఫ్రెండ్స్ కి కూడా చెబుతుంటా.మనం ఉన్నది ఇంట్లో కూర్చోని గుడ్లు పెట్టడానికి కాదని.

నా మీద గౌరవంతో చాలా మంది పురుషులు తమ హెయిర్ కట్ చేయించుకోవడానికి వస్తుంటారు.వారికి హెయిర్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.

మత పెద్దలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేదే నమ్ముతాను.

’’ అని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube