కరోనా సోకిందని బాధ పడుతున్న రోగి కోసం డాక్టర్ ఏకంగా…  

Iraq doctor, corona patients, Doctor Singing, Iraq, Corona virus, COVID-19, - Telugu Corona Patients, Corona Virus, Covid-19, Doctor Singing, Iraq, Iraq Doctor

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తున్న సంగతి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం పోలీసులు మరియు వైద్యులు, పారిశుద్ధ కార్మికులు తదితరులు నిరంతరంగా శ్రమిస్తున్నారు.

 Iraq Doctor Corona Patients Doctor Singing

అయితే తాజాగా కరోనా వైరస్ సోకిందని భయ పడుతున్న  ఓ మహిళకి ధైర్యం చెప్పేందుకు డాక్టర్ ఏకంగా గాయకుడి అవతారం ఎత్తిన సంఘటన ఇరాక్ దేశంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే ఇటీవలే ఇరాక్ దేశానికి చెందినటువంటి ఓ మహిళకి కరోనా వైరస్ సోకింది.

కరోనా సోకిందని బాధ పడుతున్న రోగి కోసం డాక్టర్ ఏకంగా…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఆమె స్థానికంగా ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరింది.  అయితే కరోనా వైరస్ సోకి నందున తీవ్రంగా బాధపడుతున్న మహిళని గమనించిన వైద్యుడు ఆమెను ఓదారుస్తూ తమ స్థానిక భాషలో భాషలో పాట పాడుతూ ధైర్యం చెప్పాడు.

ఈ విషయాన్ని గమనించిన  తోటి వైద్యుడు వెంటనే ఈ సంఘటనను తన చరవాణిలో బంధించి సోషల్ మీడియా మాధ్యమాలలలో షేర్ చేశాడు.దీంతో ప్రస్తుతం కొందరు నెటిజన్లు కరోనా వైరస్ సోకి భయ పడుతున్న రోగికి ధైర్యం చెప్పినటువంటి ఈ  డాక్టర్ కి సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇలాంటి వైద్యులు వల్లే వైద్యులను దేవుళ్ళని అంటారని ఉదాహరణగా  చూపిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు ఇరాక్ దేశవ్యాప్తంగా నమోదైన  కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గణాంకాలను పరిశీలించినట్లయితే దాదాపుగా 77 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 3 వేల పైచిలుకు మంది మృత్యువాత పడ్డారు.

కాగా మరో 44 వేల పైచిలుకు మంది విజయవంతంగా కోలుకున్నారు.

#COVID-19 #Corona Patients #Doctor Singing #Corona Virus #Iraq

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Iraq Doctor Corona Patients Doctor Singing Related Telugu News,Photos/Pics,Images..