చోద్యం : పబ్లిక్‌లో లవ్‌ ప్రపోజ్‌ చేసినందుకు అతడిపై, ఓకే చెప్పినందుకు ఆమెపై కేసు నమోదు, అరెస్ట్  

Iranian Couple Arrested After Marriage Proposal In Public-islamic Morals,marriage Proposal In Public,world And Disregard Morals

  • ఈమద్య కాలంలో లవర్స్‌ పబ్లిక్‌లో, పబ్లిక్‌గా ప్రపోజ్‌ చేసుకోవడం, హగ్‌ చేసుకోవడం చాలా కామన్‌ అయ్యింది. కొన్ని దేశాల్లో పబ్లిక్‌గానే ముద్దులు పెట్టుకోవడం, రోడ్డు పక్కనే శృంగారానికి కూడా తెగబడటం చేస్తున్న విషయం తెల్సిందే. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పబ్లిక్‌గా ప్రేమించుకోవడం కూడా తప్పే. ముఖ్యంగా ముస్లీం దేశాల్లో ప్రేమ విషయంలో చాలా కఠిన నిర్ణయాలు ఉన్నాయి. పబ్లిక్‌గా ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ కండీషన్స్‌ ఉంటాయి. ఎక్కువ ముస్లీం దేశాలు ఆడవారు బయటకు రావద్దని నిబందనలు పెట్టాయి. వచ్చినా బుర్ఖా వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి దేశమే ఇరాక్‌.

  • తాజాగా ఇరాన్‌ లో ఒక వింత సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేయాలని భావించాడు. అందుకోసం మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఒక షాపింగ్‌ మాల్‌లో ఆమె చాలా సంతోషంగా, హుషారుగా ఉన్న విషయాన్ని గమనించి అందరి ముందు ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. అతడి ప్రపోజల్‌ను ఆమె కూడా అంగీకరించింది. ఇద్దరు ఒకరిని ఒకరు హగ్‌ చేసుకున్నారు.

  • Iranian Couple Arrested After Marriage Proposal In Public-Islamic Morals Marriage Public World And Disregard

    Iranian Couple Arrested After Marriage Proposal In Public

  • ఇదంతా కూడా పదుల మంది చూస్తూ ఉన్నారు. చాలా మంది వారి వారి ఫోన్‌లలో ఈ విషయాలను బందిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అక్కడ చాలా రేర్‌గా జరుగుతాయి కనుక అంతా కూడా ఎగబడి చూశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.ఇరాన్‌లోని ముస్లీం నిబంధనలకు వ్యతిరేకంగా వీరు ప్రవర్తించారు అంటూ కొందరు మత పెద్దలు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల ముందు ప్రేమించుకోవడం, వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి మతం పరువు తీశారు అంటూ వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి కొన్ని గంటల తర్వాత విడుదల చేయడం జరిగింది.

  • Iranian Couple Arrested After Marriage Proposal In Public-Islamic Morals Marriage Public World And Disregard
  • వైరల్‌ అయిన వీడియో గురించి అందరు తెలుసుకుని, వారిని అరెస్ట్‌ చేశారనే విషయం తెలిసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. దాంతో పోలీసులు వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారాల్సిందే అంటూ అక్కడి యువత ముస్లీం మత పెద్దలను ఎదిరించేందుకు సిద్దం అవుతున్నారని ఈ సంఘటనతో తేలిపోయింది.