ఒలింపిక్ విజేత కు కూడా కరోనా పాజిటివ్  

Iran Olympic Player Corona Virusehsan Hadadi - Telugu Ehsan Hadadi, Iran Atheletic Fedaration, Iran Discus Throwar, Iran Olympic Medalist Have Coronavirus Positive, Iran Olympic Player, Spain Queen

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది.రాజు,పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా పలకరిస్తూ పోతుంది.

 Iran Olympic Player Corona Virusehsan Hadadi

ఈ కరోనా మహమ్మారి తో స్పెయిన్ రాజకుమారి కూడా మృతి చెందిన విష్యం తెలిసిందే.అయితే తాజాగా ఒలింపిక్ విజేత కు కూడా ఈ కరోనా సోకినట్లు తెలుస్తుంది.

ఇరాన్ డిస్కస్ త్రోవర్ “ఎహ్సాన్ హడాడి” కి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.అయితే హడాడి 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత మరియు 2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నాడు.

ఒలింపిక్ విజేత కు కూడా కరోనా పాజిటివ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అతడు కరోనా వైరస్ బారిన పడినట్లు ఇరాన్ అథ్లెటిక్ ఫెడరేషన్ అధికారికంగా తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందికి పైగా ప్రాణాలు తీసిన ఈ కరోనా మహమ్మారి మొత్తం 199 దేశాలకు పాకింది.

ఈ కరోనా కారణంగా అత్యంత ప్రాణ నష్టం కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి.ఇప్పటివరకు ఇరాన్ లో కరోనా మరణాల సంఖ్య 2,517 కు చేరగా,మరో 35 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు.

అయితే ఒలింపిక్ విజేత ఎహ్సన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు టైక్వాండో కాకుండా ఇతర రంగాలలో ఇరాన్ కొరకు ఒలింపిక్ పతకం సాధించిన మొదటి అథ్లెట్ ఎహ్సాన్ హదాది నిలిచాడు.ఆసియాలో పొడవైన డిస్కస్ త్రో (69.32 మీ) లో ప్రస్తుత రికార్డ్ కూడా ఎహ్సాన్ పేరు మీదే ఉండడం విశేషం.కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఎహ్సాన్ స్వీయ గృహ నిర్బంధం లోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..