అద్భుత సలహా: సివిల్స్ సాధించాలంటే ఆ ఫోనే వాడాలి!

ఈ కాలం పిల్లలు స్మార్ట్ ఫోన్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఎప్పుడు ఆటలు, సినిమాలు, సిరీస్ లు తప్ప జీవితం గురించి ఆలోచించటం లేదు.

 To Crack Civils Ips Officer Asks Upsc Candidate To Replace Smartphone With Nokia-TeluguStop.com

జీవితంలో ఏదో సాధించాలి అని అనుకుంటారు కానీ స్మార్ట్ ఫోన్ లో కొటేషన్స్ ని ఫార్వర్డ్ చేస్తుంటారు.ఎప్పుడు చూడు సోషల్ మీడియాలో ఉంటారే కానీ పనికి వచ్చే పని ఒకటి చెయ్యరు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి.”సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలంటే ఏంచేయాలి?” అని ట్విట్టర్ వేదికగా ఓ ఐపీఎస్‌ అధికారిని అడిగారు.అయితే దీనికి వన్‌షార్ట్‌లో సలహా ఇవ్వాలని అభ్యర్థి కోరాడు.దీంతో ఆ ఐపీఎస్ అధికారి ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు అందరూ అతన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.ఎందుకు అని అనుకుంటున్నారా?

అదేనండీ.”సివిల్స్ సాధించాలంటే ముందు స్మార్ట్ ఫోన్ వదిలిపెట్టు.దాని స్థానంలో నోకియా 5310ను వాడాలి” అంటూ ఆ ఐపీఎస్ అధికారి సలహా ఇచ్చారు.ఈ సమాధానాన్ని ఒడిశాకు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ అరుణ్‌బోత్రా ఇచ్చారు.దీంతో ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.స్మార్ట్ ఫోన్ ఉంటే ఏం సాదిస్తామో చెప్పలేం కానీ స్మార్ట్ ఫోన్ లేకుంటే మాత్రం ఓ మంచి జీవితాన్ని సాధించగలం అని ఈ సమాధానంతో అర్థం అయిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube