ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తాను - ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కామెంట్స్.జీవో నా చేతికి ఇంకా ఇవ్వలేదు.

 Ips Ab Venkateswara Rao Reacts On His Re Suspension Orders By Ap Government Deta-TeluguStop.com

సోషల్ మీడియాలో మాత్రమే చూసాను.ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవం.

ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదు.అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తాను.

ఈ సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో, పనికిమాలిన సలహాదారు ఇచ్చారో.? ఒకసారి హై కోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారు.12 సీబీఐ,6 ఈడీ కేసుల్లో జగన్ కు చార్జిషీట్ లు ఉన్నాయి.శ్రీలక్ష్మి గారిపైనా చార్జిషీట్ లు ఉన్నాయి.

శ్రీలక్ష్మి గారికి వర్తించని నిబంధనలు నాకు ఎలా వర్తిస్తాయి.

ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పు .నేను నిరూపిస్తాను.ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారు.

ఇజ్రాయెల్ వాళ్లకు రెండు లెటర్ లు రాశారు.అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పారు.

ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుంది.కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను టార్గెట్ చేసాయి.

కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నాను.

ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే నన్ను టార్గెట్ చేశారు.

ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు నేను కామెంట్ చేశానా.ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తాను.

సమజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్న.దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసెకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube