ఐపీఎల్ చూడడానికి ఫ్యాన్స్ లేకపోతే ఏంటి...? కొత్త ఆలోచన చేస్తున్న నిర్వాహకులు...!

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నవంబర్ 10 వరకు యూఏఈ దేశంలో జరగబోతోంది.ఇక ఇందుకు సంబంధించి బీసీసీఐ ఐపీఎల్ టీమ్స్ యాజమాన్యానికి, అలాగే ఆటగాళ్లకు బయో బబుల్ ను దాటకుండా ఉండేందుకు అనేక నిబంధనలు వారికి సూచించింది.

 Ipl 2020 To Have Pre Recorded Reactions Of Fans, Ipl2020, Fans, Corona Effect, S-TeluguStop.com

ఇక ఇప్పటికే ఐపీఎల్ లోని అన్ని జట్లు యూఏఈ దేశానికి చేరుకొని వారి క్వారంటైన్ గడిపిన తర్వాత వారికి కేటాయించిన వివిధ గ్రౌండ్స్ లో ముమ్మరంగా సాధనాలను చేస్తున్నారు కూడా.

ఇక ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లను చూడడానికి ప్రేక్షకులను ఎవరిని కూడా అనుమతించలేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది.

దీంతో అటు ఆటగాళ్లకు, ఇటు చూసే వారి ఇద్దరికీ కొత్తగా అనిపిస్తుంది.దీంతో ఇది వరకు ఉన్న మ్యాచ్ ఫీలింగ్ ని అందరూ మిస్ అవుతారు.ఇదివరకు అభిమానులు స్టాండ్స్ నుండి వారి ఇష్టమైన ఆటగాళ్లు సిక్సర్ కొడితే ఎగిరి కేరింతలు వేసే అనేక సందర్భాలను మనం చూసే ఉంటాం.ఇకపోతే ప్రస్తుతం సీజన్ కు ఇలాంటి మనం చూడలేకపోవచ్చు.

అయితే ఈ కొరతను తీర్చటానికి నిర్వాహకులు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు.

స్టేడియమ్స్ లో అభిమానులు లేరనే ఫీలింగ్ పోగొట్టేందుకు ఐపిఎల్ ఫ్రాంచైజీలు కొన్ని వినూత్న ఆలోచనలు చేపడుతున్నాయి.

అయితే ఇందుకు సంబంధించి ఇది వరకు జరిగిన సిపిఎల్, కౌంటీ లీగ్ లో కొన్ని గ్రౌండ్స్ లో అభిమానులను పోలి ఉన్న కొందరి బొమ్మలను గ్యాలరీ లో ఏర్పాటు చేశారు.అయితే ఇప్పుడు కూడా జరగబోయే ఐపీఎల్ లో కూడా ఇలాగే చేయబోతున్నారు.

అంతేకాదు కొద్దిగా ఆలోచించి ఐపీఎల్ మ్యాచ్ లలో అభిమానులకు సంబంధించిన సౌండ్ వాడుకొని మ్యాచ్ జరిగే సమయంలో వాటిని వినిపిస్తారని తెలుస్తోంది.ఆటగాళ్లు గ్రౌండ్ లో సిక్సర్లు బౌండరీలు బాదుతూ ఉంటే ఆ సమయంలో రికార్డ్ చేసిన వాయిస్ ను ప్లే చేసే విధంగా చర్యలు చేబట్టబోతున్నారు.

మరి కొన్ని ఫ్రాంచైజీలు అయితే వారి అభిమానులతో అనుసంధానం అయ్యేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.సెప్టెంబర్ 19 వ తారీఖున మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube