ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఎప్పుడంటే..!

ఐపీఎల్ 13వ సీజన్ ప్రస్తుతం యూఏఈ దేశం లో ప్లే ఆఫ్ దశకు చేరువైంది.ఇదివరకు ఐపీఎల్ సంబంధించి కేవలం లీగ్ మ్యాచ్ లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించిన బిసిసిఐ తాజాగా ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది.

 Ipl2020 Playoffs Schedule, Playoffs Time Table, Ipl2020, Abu Dhabi, Uae, Bcci-TeluguStop.com

ప్రస్తుతం లీగ్ దశ చివరి స్టేజికి రావడంతో తాజాగా ఈ షెడ్యూల్ విడుదలచేసింది బీసీసీఐ.నవంబర్ 3వ తారీకున లీగ్ దశ మ్యాచ్లు అన్ని ముగిసిపోతాయి.

ఆ తర్వాత నవంబర్ 4 విశ్రాంతి దినంగా ప్రకటించింది బీసీసీఐ.ఆపై నవంబర్ 5వ తారీఖున క్వాలిఫైయర్ 1 మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.
ఇక అబుదాబి వేదికగా నవంబర్ 6న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.ఆ తర్వాత 7వ తారీఖున విశ్రాంతి దినంగా ఇవ్వగా అబుదాబి వేదికగా క్వాలిఫైడ్ 2 మ్యాచ్ లో క్వాలిఫైయర్ 1 లో ఓడిపోయిన జట్టు అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలుపు పొందిన టీమ్స్ తలపడనున్నాయి.

ఇక చివరగా నవంబర్ 10న క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 మధ్య తుది పోరు దుబాయ్ వేదికగా జరుగనుంది.

ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టిక చూస్తే.

ముంబై ఇండియన్స్ చెట్టు మొత్తం 11 మ్యాచుల్లో అందులో 7 మ్యాచ్లలో విజయం సాధించిన 4 మ్యాచ్ లలో ఓడిపోయింది.దీంతో 14 పాయింట్లు అలాగే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో మొదటి స్థానంలో నిలవగా చివరి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 12 మ్యాచ్ లలో అందులో 4 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించి 8 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.

ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కత్తా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుస స్థానాలలో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube