ఐపీఎల్ ది బెస్ట్ అందుకే: బీసీసీఐ ఛైర్మెన్ సౌరవ్ గంగూలీ..!

ఐపీఎల్ 13వ సీజన్ రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది.గ్రౌండ్ లో సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు బ్యాట్స్ మెన్స్.

 Ipl World's Best League, Says Sourav Ganguly, Bcci President Sourav Ganguly, I-TeluguStop.com

తాజాగా జరిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా అన్నట్లు సిక్సర్ల వర్షం కురిపించారు.మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులు చేయగలిగింది.

ఇక 224 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఎవరు అనుకోని విధంగా 3 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

అయితే, ఈ మ్యాచ్ పై బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ తాజాగా స్పందించారు.

ఆయన తాజాగా జరిగిన మ్యాచ్ ను ఇదో అద్భుతమైన మ్యాచ్ అని, అందుకోసమే ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెస్ట్ లీగ్ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.అంతేకాదు ఆ మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా వారి ప్రతిభను చూపించారని అందుకే ప్రపంచ క్రికెట్ లీగ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాగా ప్రాముఖ్యం చెందిందని ఆయన తెలియజేశారు.

వీటితోపాటు ప్రపంచంలో ఎన్నో లీగ్ లు జరుగుతుంటాయని, కాకపోతే బిసిసిఐ నిర్వహించే ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఐపీఎల్ ను ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటుందని ఆయన తెలియజేశారు.ప్రతి ఒక్క క్రీడాకారుడు వారి దేశానికి ప్రాతినిధ్యం ఎలా వహించాలని ఆశిస్తారో, అలాగే ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడాలని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

దానికి కారణం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఇరు జట్లు కలిసి 34 ఫోర్లు, 29 సిక్సర్లు సాధించారు.ఇందులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బాట్స్మెన్ అగర్వాల్ సెంచరీ చేయగా రాజస్థాన్ జట్టులో ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు సాధించారు.అంతేకాదు ఫీల్డింగ్ లో కూడా ఇరు జట్లు అద్భుతమైన ప్రదర్శన చూపాయి.

ఇదివరకు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన టై మ్యాచ్ తర్వాత మరోసారి ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు అభిమానులను ఉర్రూతలూగించింది.

చివరి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన చివరకు రాజస్థాన్ రాయల్స్ ను వరించింది.చివర్లో రాజస్థాన్ రాయల్స్ బాట్స్మెన్ రాహుల్ తవాటియా కేవలం 31 బంతుల్లో ఏకంగా ఏడు సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని తన జట్టుకు అందించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube