ఐపీఎల్ 2020 స్పాన్సర్ రేసులో జియో, పతాంజలి కంపెనీలు...?!

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో భారత్ లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ కాస్త వాయిదా పడుతూ… ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యూఏఈ దేశంలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది.అయితే తాజాగా ఐదు సంవత్సరాల వరకు స్పాన్సర్ షిప్ తీసుకున్న వివో కంపెనీ స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు నిర్ణయించుకోవడంతో… ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ కు సంబంధించి స్పాన్సర్ షిప్ వెతికే క్రమంలో పడింది.ఇదివరకు ఐపీఎల్ కు 5 సంవత్సరాల కాలానికి వివో సంస్థ ఏకంగా రూ.2199 కోట్లతో (ఏడాదికి రూ.440 కోట్ల) చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది.అయితే ఇప్పుడు భారత్-చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వివో సంస్థ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి స్వచ్చందంగా వైదొలగింది.

 Ipl, Sponsership, Pathanjali, Jio, Bcci, Ipl 2020, Uae, Vivo-TeluguStop.com

Telugu Bcci, Ipl, Pathanjali, Sponsership, Vivo-Sports News క్రీడల�

ఇక ఐపీఎల్ స్పాన్సర్ గా వివో తప్పుకోవడంతో ఇప్పుడు బీసీసీఐ స్పాన్సర్ వెతికే క్రమంలో… కొత్త స్పాన్సర్ కోసం ఒకటి లేదా రెండు సంవత్సరాలకు 250 లేదా 300 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తుంది.ఇక తాజాగా ఈ స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐ వెతుకులాటలో ఉండడంతో కొందరు అభిమానులు బీసీసీఐ కి భారత దేశానికి చెందిన కొన్ని కంపెనీల పేర్లను సూచిస్తున్నారు.ఇక ఇందులో ప్రముఖంగా పతాంజలి, జియో సంస్థల పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ రెండు కంపెనీలలో ఏదో ఒక కంపెనీని స్పాన్సర్ గా తీసుకోవాలని పలువురు బిసిసిఐకి సూచిస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేవలం ఖాళీ స్టేడియంలో మాత్రమే ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతుండగా, ఇది వరకు జరిగిన ఐపిఎల్ సీజన్ లా ఆదరణ ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయాలు తెలుపుతున్నారు.అయితే ఇది వరకు స్పాన్సర్ గా ఉన్న వివో కంపెనీ లాగా స్పాన్సర్ షిప్ చేయబోయే కంపెనీలు వివో సంస్థలా అంత భారీ మొత్తాన్ని చెల్లించక పోవచ్చు మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube