ఐపీఎల్ సీజన్ 12 ప్లే ఆఫ్స్ లో ఆడబోయే జట్లు ఇవే..ఇంతకీ ఆ జట్లు ఏంటో చూడండి..

ఉత్కంఠ మ్యాచ్ లు అద్భుతమైన ప్రదర్శనల తో ఈ సీజన్ ఐపీఎల్ గొప్పగా సాగుతుంది.మరో వారం లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముగియనున్నాయి.

 Ipl Season 12 Playoff Teams 12-TeluguStop.com

ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా , బెంగళూర్ జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకున్నట్లే.ఏమైనా అద్భుతాలు జరిగితే ఈ మూడు జట్ల నుండి ఏదైనా జట్టు ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు లేకపోలేదు.

అయితే ప్రస్తుత సీజన్ లో ఈ జట్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆడనున్నాయో చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 12 మ్యాచ్ లలో నెగ్గి దాదాపు ప్లే ఆఫ్స్ లో బెర్తు ఖాయం చేసుకుంది.

ఇప్పటి వరకు ఆడిన ప్రతి సీజన్ లో ప్లే ఆఫ్స్ కి చేరిన జట్టు గా చెన్నై జట్టుకు పేరుంది.ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ ల టేబుల్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటే ఆ జట్టు కి ఫైనల్ కి చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి.

మిగితా మ్యాచ్ లలో కూడా గెలిచి పాయింట్ ల పట్టిక లో టాపర్ గా నిలవాలని సూపర్ కింగ్స్ జట్టు భావిస్తుంది.

ముంబై ఇండియన్స్ జట్టు

ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 3 సార్లు ఐపీఎల్ కప్ ని గెలుచుకుంది.

ఈ జట్టు లోని ఆటగాళ్ళ సమిష్టి రాణింపు తో 2017 లో ఛాంపియన్స్ గా నిలిచింది.ఈ సీజన్ లో కూడా ఆరంభం నుండే ఆదరకొడుతుంది.

ఇకపోతే ముంబై ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ లలో 7 విజయాలు సాధించి పాయింట్ ల పట్టికలో రెండవ స్థానం లో ఉంది.మిగితా మ్యాచ్ లలో ఆయిపోయిన ఆ జట్టు కి ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి.

ముంబై వారు ఆడబోయే మ్యాచ్ లన్ని గెలిస్తే టేబుల్ టాపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టు స్క్వాడ్ ని చూసి ఆ జట్టు ఇతర బలమైన జట్ల ముందు నిలవలేదు అన్నారు , కానీ ఇప్పుడు అదే యువ జట్టు అద్భుతాలు చేస్తుంది.

ముఖ్యం గా రిషబ్ పంత్ , ప్రిథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ లంటూ యంగ్ ప్లేయర్ లు తమ సత్తా చాటారు.వీరికి తోడుగా డగ్ ఔట్ లో రికీ పాంటింగ్ , సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాల సలహాలు ఆ జట్టు ఈ సీజన్ లో దూసుకుపోవడానికి కారణం.

ఇప్పటికే 7 విజయాలతో ఉన్న ఢిల్లీ జట్టు మరొక విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్లినట్లే.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు

సీజన్ ఆరంభం లో డేవిడ్ వార్నర్ , జానీ బైర్ స్టో బ్యాటింగ్ తో వరుస విజయాలు సాధించిన సన్ రైజర్స్ సీజన్ లో వరుస ఓటముల తో పాయింట్ ల పట్టికలో కిందికి పడిపోయారు.

సన్ రైజర్స్ ఆడిన 10 మ్యాచ్ లలో 5 విజయాలు సాదించింది.సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్స్ కి చేరాలంటే మిగితా మ్యాచ్ లన్నింటికెల్లో గెలవాల్సిందే.

ఆ జట్టు విదేశ్ ఆటగాడు జానీ బైర్ స్టో స్వదేశానికి వెళ్లిపోవడం సన్ రైజర్స్ కి పెద్ద లోటు.డేవిడ్ వార్నర్ , మనీష్ పాండే , విల్లియమ్సన్ భువనేశ్వర్ లాంటి స్టార్ ఆటగాళ్లు రాణిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు ఆ జట్టుకు ఉంటాయి.

ఆ జట్లు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడిన 11 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లలో గెలిచి 6 మ్యాచ్ లలో ఓటమి పాలయింది.ప్రస్తుతం ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు ఇతర జట్ల పైన ఆధారపడి ఉంది.

సన్ రైజర్స్ వరుసగా ఓడిపోతే పంజాబ్ కి ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి.దానితో పాటు పంజాబ్ జట్టు కూడా వారు ఆడబోయే అన్ని మ్యాచ్ లలో గెలవాల్సిందే.

కోల్ కత్తా , రాజస్థాన్ , బెంగళూర్ జట్లలో ఏదైనా ఒక జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే వారు ఆడబోయే మ్యాచ్ లు అన్ని గెలిచి 3 , 4 స్థానాల్లో ఉన్న జట్లు వరుస గా అన్ని మ్యాచ్ లు ఓడిపోవాలి.ఎక్కువగా చెన్నై , ముంబై , ఢిల్లీ తో పాటు సన్ రైజర్స్ జట్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube