ఐపీఎల్ 14 వాయిదా.. ఆస్ట్రేలియా క్రికెటర్ల దారెటు..!

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకి పెరుగుతుంది.ఈ ఎఫెక్ట్ ఐపీఎల్ మీద పడ్డది.

 Ipl Postponed Australians Cricketers Risk-TeluguStop.com

ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ.ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే క్రికెట్ అభిమానులకు మంచి క్రేజ్.

అయితే ఐపీఎల్ వాయిదా పడటం క్రికెట్ అభిమానులకు షాక్ ఇస్తుంది.అయితే ఐపీఎల్ ఆగిపోవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు రిస్క్ లో పడ్డట్టు అయ్యింది.

 Ipl Postponed Australians Cricketers Risk-ఐపీఎల్ 14 వాయిదా.. ఆస్ట్రేలియా క్రికెటర్ల దారెటు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా ఎందుకు అంటే ఐపీఎల్ లో ఆస్ట్రేలియాకు సంబందించిన ఆటగాళ్లు 40 మంది దాకా ఇక్కడ ఉన్నారు.వారిలో ఆటగాళ్లతో పాటుగా కోచ్, కామెంటేటర్స్ అందరు ఉన్నారు.

కరోనా కారణంగా ఐపీఎల్ ఆగిపోవడంతో ఇండియాలో ఉండలేని పరిస్థితి.పోని ఆస్ట్రేలియా వెళ్దామనుకుంటే విమానాలు లేవు.

అంతేకాదు ఇండియా నుండి ఆస్ట్రేలియా వస్తే జైలు శిక్ష విధిస్తామంటూ అక్కడ ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు.ఇక్కడ ఉందామన్నా సరే ఉండలేని పరిస్థితి.

ఐపీఎల్ తిరిగి మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు అందుకే ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.అయితే ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఐపీఎల్ కామెంటేటర్ మైఖెల్ స్లేటర్ ఇండియా నుండి మాల్దీవులకు వెళ్లాడు.

అయితే అతని బాటలోనే ఇండియా నుండి ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాల్దీవుల బాట పడుతున్నారని తెలుస్తుంది.ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకున్నా ఇండియా నుండి బయటపడాలని వారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

మే 15 వరకు ఇండియా నుండి ఇతర దేశాలకు విమానాలు నిషేధించింది.ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని అంటున్నారు ప్యాట్ కమిన్స్.

ఐపీఎల్ 14వ సీజన్ లో కలత్తా నైట్ రైడర్స్ జట్టుకి అతను ప్రాతినిద్యం వస్తున్నారు.

#Ipl 2021 #Postponed #Australians #Cricketers #Risk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు